Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: చంద్రబాబు మార్క్ రాజకీయం

Chandrababu: చంద్రబాబు మార్క్ రాజకీయం

Chandrababu: తెలుగుదేశం పార్టీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అనూహ్య నిర్ణయాలు పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటివరకు టిడిపి మూడు జాబితాలను ప్రకటించింది. 139 అసెంబ్లీ, 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. గతం మాదిరిగా ఎటువంటి మొహమాటలకు పోకుండా చంద్రబాబు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయగలిగారు. కొన్నిచోట్ల అయితే నిర్మొహమాటంగా సీనియర్లకు తేల్చి చెప్పారు. పూర్తిగా సర్వేలను ఒడిసిపెట్టి.. ప్రజాభిప్రాయాన్ని సేకరించిన తర్వాతే అభ్యర్థిని ఖరారు చేశారు. మాజీ మంత్రులు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, దేవినేని ఉమా, ఆలపాటి రాజా వంటి హేమహేమీలను సైతం పక్కన పెట్టారు. పొత్తులో భాగంగా కొందరు సీట్లు కోల్పోతే.. మరికొందరు ఐవిఆర్ఎస్ సర్వేలో వెనుకబడడంతో టికెట్ దక్కించుకోలేకపోయారు.

అయితే తాజాగా ప్రకటించిన అభ్యర్థుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. నామినేషన్ల దాఖలు వరకు ప్రతి అభ్యర్థి పనితీరు పరిశీలిస్తానని.. అవసరమైతే అభ్యర్థిని మార్చేందుకు కూడా వెనుకడుగు వేయనని చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని.. ప్రతికూలతలు ఉంటే మార్పు చేస్తానని కూడా తెగేసి చెప్పారు. మాజీ మంత్రి కళా వెంకట్రావును గజపతినగరం నియోజకవర్గ నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన ఎచ్చెర్లకు ప్రాతినిధ్యం వహించేవారు.

పొత్తులో భాగంగా శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాన్ని బిజెపికి కేటాయించాలని తొలుతా భావించారు. కానీ వీలుపడలేదు. అందుకే ఈసారి ఎచ్చెర్ల స్థానాన్ని బిజెపికి.. కళా వెంకట్రావును గజపతి నగరానికి పంపించాలని చూస్తున్నారు. కొద్ది రోజుల కిందటే గజపతి నగరానికి కొండపల్లి శ్రీనివాసును టిడిపి అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఆయనకు అంతగా సానుకూలత లభించడం లేదు. చీపురుపల్లికి ప్రస్తుతం కిమిడి నాగార్జున ఇన్చార్జిగా ఉన్నారు. అక్కడ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. గంటా మాత్రం తనకు భీమిలి కేటాయించాలని పట్టుబడుతున్నారు. మరోవైపు దర్శి నియోజకవర్గం నుంచి విపరీతమైన పోటీ ఉంది. ఓ ఎన్నారై తో పాటు ఇద్దరు నేతలు సీటు ఆశిస్తున్నారు. అనంతపురం,అర్బన్, గుంతకల్లు, రాజంపేట, ఆలూరుసీట్లపై చంద్రబాబు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. తనదైన శైలిలో గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలని చూస్తున్నారు. అదే సమయంలో కొందరు సీనియర్లకు టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నారు. మరోవైపు టిక్కెట్లు దక్కని వారిని బుజ్జగిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో పార్టీకి రాజీనామా చేయాలని భావించిన ఆలపాటి రాజా లాంటి వారు మెత్తబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మార్పులు జరిగిన చోట నేతలను పిలిపించి చంద్రబాబు మాట్లాడనున్నారు. ఇలా చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular