Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu silence impact on KCR: చంద్రబాబు ఎంత మౌనంగా ఉంటే కెసిఆర్ కు అంత...

Chandrababu silence impact on KCR: చంద్రబాబు ఎంత మౌనంగా ఉంటే కెసిఆర్ కు అంత నష్టం

Chandrababu silence impact on KCR: చంద్రబాబును( AP CM Chandrababu) బద్ద విరోధిగా చూసేది కేవలం ఇద్దరు మాత్రమే. సహజంగా చంద్రబాబు విషయంలో చాలామంది సాఫ్ట్ గానే ఉంటారు. కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్ష వాదులు సైతం కొంత సానుకూలంగా చూస్తారని చెప్పవచ్చు. 1995 టీడీపీ సంక్షోభ సమయంలో కేంద్రంలో బలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబుకు అండగా నిలిచింది. అయితే ఆయన బిజెపి రూట్లోకి వెళ్లారు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ స్థాయిలో ఆయనపై అటాక్ లేదు. అయితే ఇప్పటివరకు అదే పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. జాతీయ స్థాయిలో సైతం అదే స్థాయిలో గౌరవం అందుకుంటున్నారు చంద్రబాబు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆయనను విపరీతంగా వ్యతిరేకిస్తుంటారు కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి. అన్నింటికీ మించి కెసిఆర్ చంద్రబాబును నమ్మరు. నిత్యం అదే పనిగా విమర్శిస్తుంటారు. తాజాగా జగిత్యాల సభలో సైతం కెసిఆర్ ఫైర్ అయ్యారు.

గతంలో వెంటనే అటాక్..
గతంలో చంద్రబాబును కెసిఆర్ ( KCR) విమర్శిస్తే వెంటనే ఎటాక్ ప్రారంభం అయ్యేది టిడిపి నేతలు నుంచి. అయితే అలా అటాక్ ప్రారంభం అయిన మరుక్షణం దానిని తనకు అనుకూలంగా మార్చుకునే వారు కేసీఆర్. ఇదిగో తెలంగాణ ద్రోహులు అంటూ ఆయన విమర్శల పరంపర కొనసాగించేవారు. తెలంగాణ ప్రజలకు ఇష్టమైన వ్యాఖ్యలు చేసి వారిని తమ వైపునకు తిప్పుకునేవారు. అయితే ఈ సూక్ష్మాన్ని గ్రహించిన చంద్రబాబు అండ్ టిడిపి కో కెసిఆర్ ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకునే పరిస్థితిలో లేరు. అందుకే చివరకు తెలంగాణ రాజకీయ అంశాల జోలికి కూడా వారు పోదలుచుకోవడం లేదు. మొన్ననే జగిత్యాల సభలో చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చి గత పాలకులు అంటూ తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్. రెండు రోజులు అవుతున్న కెసిఆర్ కు కౌంటర్ ఇవ్వలేదు టిడిపి నేతలు. దీని వెనుకే అసలు వ్యూహం ఉంది.. ఎంత రెచ్చగొట్టినా సంయమనంతోనే ఉన్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఆదేశాలు కూడా ఉండనే ఉంటాయి.

కెసిఆర్ కు నిజంగా శాపమే..
చంద్రబాబుతో పాటు టిడిపి నేతల మౌనం కేసిఆర్ పార్టీకి శాపం. 2018 ఎన్నికల వరకు తెలంగాణలో తెలుగుదేశం మాటకు మాట అనే పరిస్థితి చాటింది. కానీ ఆ మాటలే తనకు అనుకూలంగా మార్చుకున్నారు కెసిఆర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అస్త్ర సన్యాసం చేసిందో అప్పటినుంచి కెసిఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. చంద్రబాబు సైలెంట్ అయ్యారు అదే కెసిఆర్ పాలిట శాపం. అందుకే చంద్రబాబుపై సహజంగా కోపం లేకపోయినా కేసిఆర్ ఇప్పుడు బయటకు వచ్చి ఆయన పైనే నేరుగా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు కౌంటర్ ఇచ్చిన మరుక్షణం తెలంగాణ సెంటిమెంట్ను రగిలించి బలపడాలన్నది కెసిఆర్ ఆలోచన. కానీ దానికి ఎంత మాత్రం అవకాశం ఇచ్చే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version