CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం గతేడాది అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటీ అమలు చేసే దిశగా వెళ్తుంది. హామీ ఇచ్చిన ప్రతీ పథకానికి ఆలోచించి, ఆచితూచి చంద్రబాబు వ్యవహరిస్తోంది. మాజీ సీఎం జగన్ అప్పులు చేశారని, ఆర్థిక పరిస్థితి బాగా లేదని ఒక్కో హామీని నెరవేరుస్తామని కూటమి ప్రభుత్వం తెలియజేసేది. అయితే ఏపీలో తాజాగా సంచలన పరిణామం చోటుచేసుకుంది. పథకాలు అమలు విషయంపై సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు. సీఎం చంద్రబాబు తాజాగా నీతి అయోగ్ రిపోర్టుపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగా లేదని, బిహార్ కంటే దిగజారిందని కీలక ప్రకటన చేశారు. కేంద్రం విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం కోసం నిధులు ఇచ్చిందని వీటిని వేరే వాటికి మళ్లించలేమని చంద్రబాబు వెల్లడించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా పథకాలు అమలు చేసేవాళ్లమని తెలిపారు. నిజనిజాలు ఏంటో ప్రజలకు తెలియాలనే చెబుతున్నట్లు తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామన్నారు.
నాయకుల అసమర్థత వలనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యల బారిన పడితే సమస్యలు ఎక్కువగా ఎదుర్కొనేది ప్రజలే అని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అప్పులు చేస్తే.. మళ్లీ వాటిని తీర్చడానికి అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. ప్రస్తుతం అప్పులు చేస్తే తిరిగి చెల్లించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని, మళ్లీ ఏపీ ఇబ్బందుల్లో ఇరుక్కుంటుందన్నారు. తెచ్చిన అప్పులను చిల్లరగా వాడేస్తే రాష్ట్ర ఆదాయం పెరగదని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చాలంటే ప్రస్తుతం కష్టంగా ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వ వల్ల రాష్ట్రానికి ఊహించని నష్టం జరిగిందని చంద్రబాబు అన్నారు. పెట్టుబడులు పెట్టామని, త్వరలో లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. వృద్ధి రేటు పెరిగితే.. ఆదాయం పెరుగుతుంది.. తద్వారా అప్పులను తగ్గించుకోవచ్చని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం తలసరి ఆదాయం పెరగలేదు. దీనివల్లే రాష్ట్రం అప్పుల్లో ఉండిపోయిందన్నారు. ఈ అప్పులను తీర్చడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఇచ్చిన హామీలు అన్నింటిని కూడా నెరవేర్చే వరకు ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. తమ రాష్ట్ర ప్రజలకు తప్పకుండా మంచి పాలన ఇస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పథకాలు అమలు చేయడానికి డబ్బుల్లేవ్
విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను పథకాల కోసం మళ్లించలేను
డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించను
అప్పు చేసైనా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఇస్తాము – సీఎం చంద్రబాబు pic.twitter.com/zwLDwoqNNs
— Telugu Scribe (@TeluguScribe) January 27, 2025