CM Chandrababu: చదువుకునే పిల్లలకు.. ఉద్యోగాలు చేసుకునే వారికి.. హాస్టల్స్ ఉంటాయి. వృద్ధులకు, ఇంకా కొంతమందికి ఆశ్రమాలు ఉంటాయి. ఇంతవరకు పశువులకు హాస్టల్స్ అనేవి లేవు. ఎందుకంటే పశువులకు గోశాలాలు మాత్రమే ఉన్నాయి. మన దేశంలో పలు ఆలయాలు గోవులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. వాటికి పోషణ ఇస్తున్నాయి. అందువల్లే వాటిని ఆశ్రయాలు అని పిలుస్తుంటారు. ఆశయాలలో గోవులకు గ్రాసం, నీరు పెడుతుంటారు. సంరక్షణ బాధ్యత కూడా చూసుకుంటారు.
మనదేశంలోనే కాదు, విదేశాలలో కూడా పశువులకు హాస్టల్స్ అనేవి లేవు.. దేశంలో, విదేశాలలో డెయిరీ ఫామ్స్ ఉంటాయి. వీటిల్లో రకరకాల గేదెలను, ఆవులను సంరక్షిస్తుంటారు. వాటి ద్వారా సేకరించిన పాలను బయట విక్రయిస్తుంటారు. తొలిసారిగా మనదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశువులకు హాస్టల్స్ అనేవి అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ ప్రకటన చేశారు. పశువులకు హాస్టల్స్ కట్టించాలని.. ఇందుకోసం షెడ్లు నిర్మించాలని.. వాటికోసం గ్రాసం అక్కడికే పంపిస్తామని చంద్రబాబు వెల్లడించారు.. గుంటూరు జిల్లాలోని మాచర్ల లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ” గతంలో మాచర్లలో పరిస్థితి బాగుండేది కాదు. ఎన్నికలు కూడా నిర్వహించే పరిస్థితి ఉండేది కాదు. ఎక్కడో రాజీవ్ గాంధీ హత్య జరిగితే ఇక్కడ రౌడీలు విధ్వంసం సృష్టించారు. మొన్నటి వరకు ఇక్కడ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉండేది కాదు. ఏకంగా ఇంటికి తాళ్ళు కట్టి రానివ్వకుండా అడ్డుకున్నారు. నా ఇంటికి తాళ్లు కడితే.. మీ మెడకు ఉరి తాళ్ళు వేసుకుంటున్నారని హెచ్చరించారు. ప్రవర్తన గనక మార్చుకోకపోతే ప్రజలు ఎప్పటికి క్షమించబోరని అప్పుడే అన్నాను. ఇప్పుడు నిజమైంది” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇటీవల కాలంలో వ్యవసాయంలో యాంత్రికరణ పెరిగిన నేపథ్యంలో పశువుల సంఖ్య తగ్గిపోతుంది. పశువుల పెంపకంలో రాబడి అంత మాత్రం గా ఉండడంతో చాలామంది రైతులు పశువులను పెంచుకోవడం లేదు. ఇది అంతిమంగా వ్యవసాయం మీద ప్రభావం చూపిస్తోంది. అందువల్లే పశువుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంతేకాదు పశువుల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోబోతోంది. దీనివల్ల పశువుల సంఖ్య పెరుగుతుందని పశువుల్లో మరణాలు కూడా తగ్గిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది.
పశువులకు కూడా హాస్టల్స్ కట్టిస్తాం
ఇప్పటివరకు పిల్లలకు, వృద్ధులకు హాస్టళ్లు కట్టించాం.. ఇప్పుడు పశువులకు కూడా కట్టిస్తాం.. గడ్డి కూడా అక్కడికే పంపిస్తాం – సీఎం #ChandrababuNaidu pic.twitter.com/7HOYtqbT95
— greatandhra (@greatandhranews) September 20, 2025