CM Chndrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పై ఫోకస్ పెట్టింది. గత ఐదేళ్లలో టీటీడీ వ్యవహారాలు గాడిన తప్పినట్లు ప్రభుత్వం గుర్తించింది. అందుకే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. భక్తులకు దర్శన టికెట్ల నుంచి అన్న ప్రసాదం వరకు విమర్శలకు తావు లేకుండా చూడాలని భావిస్తోంది. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. గత ఐదేళ్ల కాలంలో టీటీడీ పవిత్రతను, ప్రతిష్టను మంటగలిపే చర్యలకు పాల్పడ్డారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారు అని కామెంట్స్ చేశారు. ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు చేసిన కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులకు సౌకర్యాలకు సంబంధించి సరళతరం చేశారు. అధికారుల టీం ను కూడా మార్చారు. త్వరలో పాలకవర్గాన్ని సైతం నియమించనున్నారు.
* లడ్డు తయారీలో జంతు నూనె వాడారా?
తిరుమల అంటేనే ప్రపంచం లోనే పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం. స్వామివారి దర్శనానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు. అటువంటి దేవస్థానం మన రాష్ట్రంలో ఉండడం గర్వించే విషయం. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రసాదం తయారీలో అడ్డగోలుగా వ్యవహరించారని తెలియడం హాట్ టాపిక్ గా మారుతోంది. లడ్డు తయారీని ఒక పవిత్రతగా భావిస్తారు. కానీ లడ్డు తయారీలో జంతువు నూనెను వాడారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏకంగా సీఎం చంద్రబాబు నోటి నుంచి ఈ ఆరోపణలు రావడం సంచలనం గా మారుతోంది. జగన్మోహన్ రెడ్డి అయ్యాం లో దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలను కూడా అపవిత్రం చేశారన్న చంద్రబాబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
* స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. టిటిడి పై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ సంచలన విషయం బయటకు వచ్చింది. అందుకే దిద్దుబాటు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. స్వచ్ఛమైన నెయ్యిని తప్పించి లడ్డు ప్రసాదం కోసం వాడుతోంది. అయితే చంద్రబాబు రాజకీయ విమర్శలు చేయడం సర్వసాధారణం.. కానీ ఎంతో పవిత్రంగా భావించే టీటీడీ విషయంలో విమర్శలు చేయరు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఎంతో కొంత నిజం లేకుంటే ఆయన ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు అన్నది చర్చకు దారితీస్తోంది. టీటీడీ విషయంలో ఇప్పటికే జగన్ సర్కార్ పై విమర్శలు ఉన్నాయి. ఇవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఇటువంటి సమయంలోనే చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం.
* టీటీడీలో ప్రక్షాళన
వాస్తవానికి టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీటీడీలో ప్రక్షాళన ప్రారంభమైంది. ఈవో ధర్మారెడ్డి పై వేటు వేశారు. సమర్థ అధికారిగా పేరు తెచ్చుకున్న శ్యామలరావును నియమించారు. దీంతో ఆయన సీరియస్ యాక్షన్ కు దిగారు. తిరుమలలో అవినీతిని అరికట్టేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తిరుమల పవిత్రతను కాపాడేలా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తప్పిదాలు గుర్తించి వెనువెంటనే చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే లడ్డు తయారీలో జంతు నూనెను వాడుతుండడం వెలుగు చూసినట్లు తెలుస్తోంది. దీనిపై మున్ముందు మరింత వివాదం రగిలే అవకాశం ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Chandrababu revealed the sensational facts of tirumala misdeeds in the ycp government
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com