Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: ప్లాన్ బి తో చంద్రబాబు

Chandrababu: ప్లాన్ బి తో చంద్రబాబు

Chandrababu: ఏపీలో( Andhra Pradesh) మరోసారి కూటమి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమాతో ఉన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన ప్రణాళికలతో పాటు ప్లాన్లు తమ వద్ద ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిందని..తామే అధికారంలోకి వస్తామని భావిస్తోంది. లోలోపల మాత్రం భయం వెంటాడుతోంది. ఎందుకంటే కూటమికి ప్రజలు మరోసారి ఛాన్స్ ఇవ్వాలన్న ఆలోచనకు కచ్చితంగా చంద్రబాబు తెస్తారు. గతంలో చేసిన తప్పిదాలను మరోసారి జరగనివ్వకూడదని ప్రజలకు అర్థమయ్యేలా చెబుతారు. కానీ ప్రజలను కన్వెన్స్ చేయాల్సిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అతి ధీమాతో ముందుకు సాగుతోంది. కానీ కూటమి వద్ద ఉన్న సానుకూల అంశాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోలేకపోతోంది.

* తరచూ మారుతున్న స్టాండ్
రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) స్టాండ్స్ మార్చుతూ వచ్చారు. ఆయన తన విధానాలను సమర్ధించుకోవచ్చు కానీ.. తరచూ మాటలు మార్చుతుండడాన్ని మాత్రం ప్రజలు సహించరు అన్న విషయాన్ని గ్రహించడం లేదు. అయితే ఈ విషయంలో చంద్రబాబు ప్రజలను వివరించేందుకు ప్రయత్నం చేస్తారు. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని సైతం సానుకూలంగా మార్చుతారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అది స్పష్టమైన లోటు. ఎంతవరకు రెచ్చగొట్టే ఆరోపణలు, విమర్శలు వరకే ఆ పార్టీ నేతలు పరిమితం అవుతున్నారు. అవి తిరిగి కచ్చితంగా ఆ పార్టీకి చేటు తెస్తాయి. ఇదిగో వారు ఇంకా మారలేదు. ఇక మీ ఇష్టం అన్నట్టు వైసిపి పై ఖచ్చితంగా కూటమి ప్రచారం చేస్తుంది. దానికి అవకాశం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.

* అమరావతి తో పాటు పోలవరం..
చంద్రబాబుకు( CM Chandrababu) అన్నింటికీ మించి సానుకూలం అమరావతి. ఇదిగో అమరావతి కట్టాం అని ప్రజలకు ఆయన తప్పకుండా సూచిస్తారు. కనీసం 2029 నాటికి 100 భవనాలు వరకు నిర్మించి చూపిస్తారు. అమరావతి ఫేజ్ వన్ పనులను పూర్తి చేయిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతిని చూపి ఓట్లు అడుగుతారు. ఇదిగో మళ్లీ కూటమి వస్తేనే ఈ అమరావతి నిర్మాణం పూర్తి అవుతుంది అని చెబుతారు. ఆ ఒక్కటే కాదు పోలవరం ప్రాజెక్టు సైతం తొలి విడత పనులు పూర్తిచేసి నీటిని అందిస్తారు. ప్రజల్లో మరింత ఆశలు రేపుతారు. మళ్లీ కూటమి అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు.

* చంద్రబాబు చుట్టూ వలయం..
కూటమికి నలువైపులా చెప్పే బలమైన నేతలు, వ్యూహకర్తలు ఉన్నారు. వారు చెబితే ప్రజలు నమ్ముతారు కూడా. అలాగే కొంతమంది విశ్వసనీయమైన నేతలను చంద్రబాబు తన వద్ద ఉంచుకున్నారు. వారికి ప్రజల వద్ద మంచి గౌరవం ఉంది. పైగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పే మీడియా ఉంది. అది జగన్మోహన్ రెడ్డికి మైనస్. ఇప్పటికీ మీడియా ముందుకు వచ్చి అతిగా మాట్లాడే నేతలు చాలామంది ఉన్నారు. వారి మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. దానిని గుర్తించడం లేదు జగన్మోహన్ రెడ్డి. ఇలా చంద్రబాబు వద్ద ప్లాన్ బి అనేది లేకపోవచ్చు కానీ.. ఆయన ఆలోచనలు మాత్రం పక్కా ప్రణాళికతోనే ఉంటున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular