Chandrababu Naidu:ఇది మామూలు స్ట్రోక్ కాదు. ప్రతి మాటలో పంచ్ ఉంది.. అంతకు మించిన మాస్ ఉంది. ఒకరకంగా 1995 కాలంలో ఉన్న వాతావరణం కళ్ళముందు కనిపించింది. మొత్తంగా చూస్తే ఫ్యూజులు ఎగిరిపోయాయి.. లోకల్ బాడీ ఎలక్షన్లలో కూటమిపై అడ్డగోలు ప్రచారాలు.. న్యాయస్థానాలకు వెళ్లి కేసులు.. ఇలా రకరకాల వ్యవహారాలకు పాల్పడుతున్న ఫ్యాన్ పార్టీకి.. ఆ పార్టీ అధినేత కు ఏపీ సీఎం ఇచ్చి పడేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్.. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జగన్ కు సినిమా చూపించారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూటమి ఏపీలో దూసుకుపోతోంది. ఎన్నికలు సజావుగా జరిగేలా.. ప్రజలు భయపడకుండా తమ ఓట్లను వేసే విధంగా చూస్తోంది. కాకపోతే ప్రతిపక్ష హోదా లేని వైసీపీకి ఘర్షణలు కావాలి. ఇప్పటి లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా అదే తీరు చూపిస్తోంది. అధినేత తీరుగానే కింది స్థాయి కార్యకర్తలు కూడా అలానే ఉంటారు. వైసీపీలో జగన్ షర్టు మడత పెట్టి.. 2.0 చూపిస్తా అంటున్నారు. కింది స్థాయి కార్యకర్తలు కూడా ఆదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ల వ్యవహారాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అయితే వారికి కూటమి నేతలు బలమైన సమాధానం చెబుతున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలకు ఏం చేయాలో పాలు పోవడం లేదు.
సొంత మీడియాలో విష ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వైసీపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని కూటమిలో ఉన్న ముగ్గురు కీలక నాయకులు చంద్రబాబు.. పవన్ కళ్యాణ్.. మాధవ్ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో మూడు ఇంజన్ల సర్కార్ వల్ల ఏపీ రాష్ట్రం ఏ స్థాయిలో డెవలప్ అయింది.. ఎంతలా పెట్టుబడులు వస్తోంది.. వైసిపి ఎలాంటి అడ్డు పుల్లలు వేస్తోంది అనే విషయాలను చాలా క్లియర్ కట్ గా వివరించారు.
“రాష్ట్రం డెవలప్ అవుతుంది. వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తే వైసిపి తట్టుకోలేకపోతోంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు గనుక జరపకపోతే ఏపీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావు. డెవలప్ ఆగిపోతుంది. వైసిపికి డెవలప్మెంట్ ఇష్టం ఉండదు. ఒక అవాస్తవాన్ని వారు పదే పదే ప్రచారం చేస్తున్నారు. కాకపోతే అది నిజం కాదు. అసత్యాలను.. సత్యాలను తెలుసుకోవాలని స్థాయిలో ప్రజలు లేరు.. నాకు పేషెన్సీ చాలా ఉంటుంది. హింసకు సరైన సమాధానం పేషెన్సి. భాగ్యనగరాన్ని డెవలప్ చేస్తున్నప్పుడు చాలామంది ఇలానే అన్నారు. వాటికి నేను భయపడలేదు. అందువల్ల హైదరాబాద్ ఈరోజు నెంబర్ వన్ ఎకానమీ గా రూపాంతరం చెందుతోంది. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. రాయలసీమ నాలెడ్జ్ ఎకానమీ.. గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుతోంది.. వైసిపి గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు తొమ్మిది సార్లు పవర్ చార్జీలు పెంచారు. మేము రూలింగ్ లోకి వచ్చిన తర్వాత ఇంతవరకు రూపాయి కూడా పెంచలేదు. పైగా నాటి సీఎం బటన్ కు మాత్రమే పరిమితమయ్యారు. ఇక పోలవరం కంప్లీట్ అయితే.. కృష్ణ వాటర్.. సీమకు వస్తాయని” చంద్రబాబు వ్యాఖ్యానించారు.
“మేము రూలర్లం కాదు. జస్ట్ పీపుల్ ఫ్రెండ్లీ లీడర్లం మాత్రమే. ఇప్పటివరకు డబుల్ ఇంజన్ సర్కార్ అనుకునేవాళ్ళు. ఇది ముమ్మాటికీ మూడు ఇంజన్లున్నల సర్కార్. ప్రజలకు కూడా తెలుసు. మేము డెవలప్మెంట్ వేగంగా చేయాలి అనుకుంటున్నాం.. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా లీడర్షిప్ స్థిరంగా ఉంటుంది. ఎడ్యుకేటర్లను కాండిడేట్లుగా నియమించాం. ఎన్నికల్లో ఎవరికి అవకాశం కల్పిస్తున్నారో ఏపీ వాసులు ఆలోచించుకోవాలని” పవన్ కళ్యాణ్, మాధవ్ వ్యాఖ్యానించారు.