CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) విలక్షణ నేత. ఆయనపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. అయితే ఆయనలో ఒకవైపు సంప్రదాయ నాయకుడు కనిపిస్తాడు. మరోవైపు ఆధునిక తరహా ఆలోచనలతో ముందుకు సాగే నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి. పాలన విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతుంటారు. అయితే పార్టీ క్రమశిక్షణ అంశానికి వస్తే మాత్రం పాత తరహా విధానాలు కనిపిస్తాయి. ఆపై ఉదాసిన వైఖరి అధికం. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే.. ఎలాంటి ఫలితాలు వస్తాయో నన్న ఆందోళన ఆయనది. తమ పార్టీ నాయకులు నిబంధనలు అతిక్రమించినప్పుడు, కట్టు దాటినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా స్పందిస్తారు. కానీ ఆ స్పందనలో కూడా ఒక సమతుల్యం పాటిస్తూ ఉంటారు. మాటల వరకే కఠినం కనిపిస్తుంది కానీ.. క్షేత్రస్థాయిలో చర్యల విషయానికి వస్తే మాత్రం ఆ పరిస్థితి ఉండదు. ఇలానే ఉపేక్షిస్తే మాత్రం గత అనుభవాలు ఎదురుకావడం ఖాయం.
Also Read: ఓ కూతురు, ఒక చెల్లి, ఒక స్నేహితురాలు.. హీరోలను మించిన శ్రీలీల గొప్పతనం!
* ఎమ్మెల్యేల చుట్టూ వివాదాలు..
తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) గతంలో ఎన్నడూ లేని విధంగా.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అధికం. కానీ వారు అనేక వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడే చంద్రబాబు ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించుకున్నారని.. వారి నమ్మకాన్ని కచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మద్యం తో పాటు ఇసుక వంటి జోలికి వెళ్ళవద్దని కూడా చెప్పుకొచ్చారు. కానీ చాలామంది ఎమ్మెల్యేలు వాటి జోలికి వెళ్లారు. చివరకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా చేతులు పెట్టారు. వారిపై సొంత మీడియాలోనే కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల పట్ల ప్రజలకు సంతృప్తి ఉంది. కానీ ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి మాత్రం పరిస్థితి అదుపుతప్పుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. ఓ 35 మంది ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడినట్లు కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే చర్యలకు ఉపక్రమిస్తానని కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు.
* ఆచరిస్తేనే..
కానీ ఏ ప్రభుత్వానికైనా హనీమూన్ పీరియడ్ ఉంటుంది. టిడిపి కూటమి( TDP Alliance ) ప్రభుత్వానికి ఆ పీరియడ్ పూర్తయిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చెడ్డపేరు తెచ్చిన ప్రవర్తిస్తున్న నేతలపై కఠినంగా వ్యవహరించకపోతే.. మిగతా వారిలో భయం పోతుందన్న విషయాన్ని గ్రహించుకోవాలి. అందుకే మాటలకు పరిమితం కాకుండా.. ఆచరణలో చర్యలు తీసుకుంటేనే పార్టీ శ్రేణుల్లో క్రమశిక్షణ బలపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు అనుభవం ఉన్న నేత. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు. పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం ఉంది. అందుకే మాటలకు పరిమితం కాకుండా.. ఆచరణలో చూపించి.. పార్టీ శ్రేణులకు సరైన సంకేతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకుంటే మూల్యం తప్పదు.