CM Chandrababu: ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల కాలం. ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడితే.. దానికి వంద రకాలుగా వక్రీకరణలు చేసే కాలం. కాబట్టి ఒక మాట మాట్లాడే విషయంలో సాధారణ వ్యక్తి నుంచి మొదలుపెడితే రాజకీయ నాయకుడి వరకు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే విమర్శలు ఎదురవుతుంటాయి. ఆరోపణలు వినిపిస్తుంటాయి. వాటన్నిటిని కాచుకోవాలంటే చాలా కష్టం. పైగా ఎవరు ఎలాంటి కామెంట్స్ చేస్తారో అర్థం కాదు. కొన్ని కామెంట్స్ అత్యంత హార్ష్ గా ఉంటాయి కాబట్టి.. వాటిని స్వీకరించడం ఇబ్బందికరంగా ఉంటుంది.
Also Read: ప్రక్షాళన.. ఏపీ క్యాబినెట్ నుంచి 8 మంది ఔట్!
రాజకీయ నాయకులు కచ్చితంగా అభివృద్ధి చేయాలి.. భవిష్యత్తు తరాల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని.. ప్రస్తుత తరాల భద్రతను మననంలో పెట్టుకుని పనులు చేయాలి. చేసిన పనిని చెప్పుకోవాలి. అయితే దానికి కూడా ఒక పరిధి అంటూ ఉంటుంది. ప్రతిసారి చర్విత చరణం లాగా చెప్పుకుంటూ పోతే వినే వాళ్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. అది సొంత పార్టీ నాయకులైనా సరే.. చేసిన అభివృద్ధిని కొన్ని సందర్భాల్లో చెప్పుకొని.. చేయాల్సిన పనుల గురించి చెబుతుంటే వినే వాళ్లకు కూడా వినసొంపుగా ఉంటుంది. నాయకుడి భవిష్యత్తు లక్ష్యాలపై కార్యకర్తలకు కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది. అలాకాకుండా భవిష్యత్తు లక్ష్యాలను పక్కనపెట్టి.. గతంలో చేసిన పనుల గురించి చెప్పుకుంటూ పోతే ఇబ్బందికరంగా ఉంటుంది. మా తాతలు నేతులు తాగారు.. వారి మూతుల వాసన చూడండి అని ప్రతిసారి అంటుంటే చికాకు కలుగుతుంది. పైగా ఇప్పుడు సోషల్ మీడియా రోజులు కాబట్టి.. ట్రోల్స్ అనేవి ఉంటుంటాయి. వాటినుంచి కాచు కోవాలంటే ఇటువంటి మాటలు మాట్లాడకూడదు.
Also Read: పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి టీడీపీ ఎమ్మెల్యే ‘కొలిపూడి’ రచ్చరచ్చ
ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు.. రాజధాని నిర్మాణంలో తన వంతు ముందుచూపుతో వెళ్తున్నారు. ఇప్పటికే కేంద్రం రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తున్నటు ప్రకటించింది. గత ఐదు సంవత్సరాలుగా పడావు పడిన అనేక భవనాలను ఆధునీకకరిస్తున్నారు. మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలను మళ్లీ చేపడుతున్నారు.. పెరిగిపోయిన తుమ్మ చెట్లను కొట్టేస్తున్నారు. నిర్మాణ పూర్తయిన భవనాలకు రంగులు వేస్తున్నారు. మొత్తంగా అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇది శుభ పరిణామం. కాకపోతే అమరావతి గురించి చెప్పకుండా చంద్రబాబు నాయుడు గతంలో నేను హైదరాబాదును అభివృద్ధి చేశాను.. హైదరాబాద్ నగరంలో గొప్ప గొప్ప నిర్మాణాలు నావల్లే అని చంద్రబాబు చెప్పుకుంటూ ఉండటం కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అన్ని సందర్భాల్లో అది అంతగా వర్కౌట్ అవడం లేదు. పైగా రొటీన్ రొడ్డ కొట్టుడు ఉపన్యాసం లాగా ఉండడంతో వినే వాళ్లకు.. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది ఎదురవుతోంది..” ఎన్నిసార్లు ఈయన చెప్పిందే చెబుతారు. భవిష్యత్ గురించి ఏదైనా వ్యాఖ్యలు చేసి ఉంటే బాగుంటుంది కదా. హైదరాబాద్ చరిత్ర అనేది గతం. ఇప్పుడు ఆయన చేయాల్సింది అమరావతి గురించి. దాని గురించి ఏమైనా మొన్న నాలుగు మాటలు మాట్లాడితే బాగుంటుందనుకుంటే.. ఈయన ప్రతి సందర్భంలోనూ హైదరాబాద్ గురించి మాట్లాడుతుండడం ఇబ్బంది కలిగిస్తుందని” పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.