Chandrababu Welfare Schemes: ఈ క్రమంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ ఏం చేసామో వివరించారు. స్వయంగా తానే ప్రతినెల పింఛన్ల పంపిణీలో పాల్గొనడానికి గల కారణాన్ని చంద్రబాబు నాయుడు వివరించారు. అలాగే తల్లికి వందనము మరియు అన్నదాత పథకాలపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో కడపలో జరిగిన మహానాడు విజయవంతం కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో రాష్ట్రంలో ఉన్న పథకాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న పూర్తి నమ్మకాన్ని నిజం చేస్తున్నామని ఆయన తెలిపారు.
Also Read: ఇజ్రాయెల్ తో మస్సాచుసెట్స్ వర్సిటీ రక్షణ ఒప్పందాలు.. మేఘ వేమూరి ఇదే ఎత్తి చూపిందా?
అలాగే ఏడాది పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు పాలన నిర్ణయాలపై ఏపీ రాష్ట్ర ప్రజలలో సానుకూలత ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కడప లో జరిగిన మహానాడు కార్యక్రమాలు ద్వారా ఏడాది పాలనలో ఏపీ ప్రజలకు ఏం చేశామో అలాగే రానున్న రోజులలో ఏం చేస్తామో తెలియజేశారు. నేతలు ప్రజలతో మమేకం అయ్యి ప్రభుత్వం రాబోయే రోజులలో చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తానే స్వయంగా ప్రతినెల పాల్గొనడానికి గల కారణం కూడా అదే అని చంద్రబాబు నాయుడు వివరించారు. ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పేదల సేవల కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన తెలిపారు. తల్లికి వందనం మరియు అన్నదాత పథకాలను జూన్ నెలలో ప్రారంభిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఆగస్టు నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందేలాగా సంక్షేమ క్యాలెండర్ను కూడా త్వరలోనే ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందిస్తామని తెలిపారు. టిడిపి మహానాడు కడపలో చాలా అద్భుతంగా జరిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో ఉన్న నాయకత్వం అంతా కలిసి పని చేసే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు ప్రశంసించారు. మహానాడు కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు నేతలకు చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.