CM Chandrababu: 10 సంవత్సరాల వయసులో ఉన్న ఉత్సాహం 20 సంవత్సరాల వయసులో ఉండదు. ఇలా వయసు మారుతున్న కొద్దీ మనుషులలో మార్పులు వస్తుంటాయి. ఇది సహజంగా జరిగే ప్రక్రియే. కానీ కొంతమంది వయసు వెనక్కి పంపించేస్తుంటారు. తమ ఉత్సాహం ముందు.. తమ క్రమశిక్షణమందు వయసును చిన్నబోయేలా చేస్తారు. అటువంటి వారిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరు. వాస్తవానికి ఈ జాబితాలో చంద్రబాబు నాయుడు కు మొదటి స్థానం ఇవ్వాల్సి ఉంటుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం నాడు చంద్రబాబు నాయుడు అనేక దేశాలు తిరిగారు. మైక్రోసాఫ్ట్ అనే సంస్థను హైదరాబాద్ తీసుకొచ్చారు. మైక్రోసాఫ్ట్ ద్వారా ఐటీకి ఒక ఎకో సిస్టం డెవలప్ చేశారు. ఈరోజు హైదరాబాద్ ఐటి విభాగంలో ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అనడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ఈ విషయాన్ని అనేకమంది ముఖ్యమంత్రులు.. అనేకమంది నాయకులు ఒప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు మొదటినుంచి కూడా ఆహారం తీసుకునే విషయంలో కట్టుదిట్టంగా ఉంటారు. ఏమాత్రం దానిని బ్రేక్ చేయరు. ఆయనకు ఎంతో కాలం నుంచి మధుమేహం ఉంది. అయినప్పటికీ అయినప్పటికీ దానిని నియంత్రణలో ఉంచుకుంటున్నారు. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నం తినరు. కేవలం తృణధాన్యాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. కాఫీ తాగుతారు. గ్రిల్డ్ ఫిష్ తీసుకుంటారు. నాన్ వెజ్ విషయంలో ఆయనకు చాలా లెక్కలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేస్తారు. యోగా చేస్తారు. మెడిటేషన్ కూడా చేస్తారు. అందువల్ల చంద్రబాబు ఏడుపదుల వయసు దాటినప్పటికీ కూడా ఉత్సాహంగా కనిపిస్తుంటారు. ప్రతి విషయాన్ని కూడా గుర్తుంచుకుంటారు. ఆ విషయాన్ని చెప్పడానికి ఏమాత్రం సంకోసించరు.
చంద్రబాబు ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మించడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. కేంద్రంలో అనుకూలమైన ప్రభుత్వం ఉన్నప్పటికీ చంద్రబాబు స్వీయ శక్తిని నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు. ఈ వయసులో కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతంలో అనేక దేశాలను తిరిగివచ్చారు. అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న పెట్టుబడుల సదస్సుకు రావాలని అక్కడి కంపెనీల అధిపతులను కోరారు. అక్కడి ప్రభుత్వ అధినేతలను విన్నవించారు. అమరావతిలో భారీగా విదేశీ సంస్థలను తమ కార్యకలాపాలు ప్రారంభించే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరకంగా ఇది సానుకూల అంశం. ఏపీ రాష్ట్రానికి మరింత సానుకూల అంశం. రాజకీయాల విషయాలను పక్కన పెడితే చంద్రబాబు ఈ వయసులో కూడా అక్కడికి వెళ్లడం ఒకరకంగా అద్భుతం అని చెప్పాలి. ప్రత్యేకమైన విమానాలు ఉన్నప్పటికీ.. అనేక రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ ఈ వయసులో ఆయన అక్కడికి వెళ్లడం మిరాకిల్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
మనదేశంలోని కొన్ని రాష్ట్రాలలో చంద్రబాబు కంటే తక్కువ వయసు ఉన్నవారు.. చంద్రబాబుతో సమానంగా వయసు ఉన్నవారు.. చంద్రబాబు కంటే ఎక్కువ వయసు ఉన్నవారు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. కానీ చంద్రబాబు మాదిరిగా ఎవరూ పెట్టుబడుల కోసం ఇతర దేశాలకు వెళ్లడం లేదు. ఇతర దేశాల కంపెనీల ప్రతినిధులను ఒప్పించడం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి విషయంలో అహర్నిశలు శ్రమించడం లేదు. సాధారణంగా ఒక వయసుకు వచ్చిన తర్వాత చాలామంది ఉత్సాహంగా పనిచేయలేరు.
ముఖ్యంగా 70 సంవత్సరాల వయసు దాటిన తర్వాత చాలామంది రిలాక్స్ అవ్వాలని కోరుకుంటారు. వయసు వల్ల వచ్చిన నీరసం కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ చంద్రబాబుకు అలసట అనేది తెలియడం లేదు. నీరసమనేది దరిచేరడం లేదు. ఈ వయసులో కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. తన కలల రాజధాని కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. కేంద్రం నుంచి మొదలుపెడితే విదేశాల వరకు ఆయన అన్ని తలుపులను కూడా తడుతున్నారు. ఉజ్వలమైన ఏపీ కోసం బలమైన అడుగులు వేస్తున్నారు. ఒక నాయకుడు అనే వాడు బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. దృఢమైన ఆలోచనలను అమలు చేయాలి. అప్పుడే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు చేస్తోంది కూడా అదే.