Venkatesh And Trivikram Movie: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణమేంటంటే వాళ్ళు చేస్తున్న సినిమాలు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ ఉంటాయి. అందువల్లే వాళ్ళ సినిమాలను చూడడానికి చూపిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే సీనియర్ వెంకటేష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకప్పుడు ఆయన గొప్ప సినిమాలను చేశారు ప్రస్తుతం మంచి సినిమాలను చేస్తూనే తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికి సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది…వెంకటేష్ చేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే…
Also Read: 2026 లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్న మెగాస్టార్..చరిత్రలో ఇదే తొలిసారి
త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత వెంకటేష్ తో ఒక సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బాడీగార్డ్ గా వెంకటేష్ నటిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన ఇప్పటివరకు ఇలాంటి పాత్రనైతే పోషించలేదు.
బాడీగార్డ్ సినిమాలో బాడీగార్డ్ గెటప్ వేసినప్పటికి సెక్యూరిటీ బాడీగార్డ్ గా మాత్రం ఎప్పుడు నటించలేదు… ఇక త్రివిక్రమ్ సినిమాల్లో హీరోలందరు టాక్సీ డ్రైవర్లుగా ఉంటారు. ఇక దానికి భిన్నంగా ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ గా నటింపజేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. త్రివిక్రమ్ నుంచి ఒక సినిమా వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తోంది. అయినప్పటికి ఆయన ఇప్పుడు సినిమాని స్టార్ట్ చేసి వీలైనంత తొందరగా ఈ సినిమాను ఫినిష్ చేసి సక్సెస్ సాధించాలని చూస్తున్నారు.
ఈ సినిమా తర్వాత ఆయన ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. చూడాలి మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది… ఈ మూవీ తో త్రివిక్రమ్ తన పూర్తి స్టామినాను బయటపెట్టాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే తన తోటి హీరోలందరూ పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఆయన మాత్రం పాన్ ఇండియాలో ఇంకా ఎంట్రీ ఇవ్వడం లేదు…ఇక ఎన్టీఆర్ సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేయాలని చూస్తున్నాడు…