OG Collection: ఈ ఏడాది థియేటర్స్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘ఓజీ'(They Call Him OG). పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ఈ చిత్రం విడుదలకు ముందు ఏ రేంజ్ హైప్ ని క్రియేట్ చేసుకుందో మనమంతా చూసాము. సాధారణంగా భారీ అంచనాలతో వచ్చే సినిమాలు వాటిని అందుకోవడం లో విఫలం అవుతుంటాయి. ‘కూలీ’ చిత్రం అందుకు ఉదాహరణ. ఓజీ కూడా అలాగే అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా అభిమానులను ఒక రేంజ్ లో అలరించింది. పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి కంటెంట్ ని అయితే ఇనాళ్ళు మిస్ అయ్యారో, అలాంటి కంటెంట్ ని డైరెక్టర్ సుజిత్ చూపించే లోపు అభిమానులు మెంటలెక్కిపోయారు. చూసిన వాళ్ళే పదే పదే ఈ చిత్రాన్ని చూసారు. మూవీ లవర్స్ కి కూడా ఈ సినిమా యావరేజ్ అనిపించడం తో బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
Also Read: 2026 లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్న మెగాస్టార్..చరిత్రలో ఇదే తొలిసారి!
థియేటర్స్ లో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఈ చిత్రాన్ని రెండు రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. తెలుగు, హిందీ, తమిళం భాషలతో పాటు, ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడం తో ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో ట్రెండ్ అవుతూ ప్రభంజనం సృష్టించింది. వాటిల్లో 8 దేశాల్లో టాప్ 1 స్థానం లో ట్రెండింగ్ అవుతుండగా, వాటిల్లో పాకిస్థాన్, బాంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా ఉండడం గమనార్హం. వీటితో పాటు ఇండియా, మాల్దీవ్స్, మారిటస్, ఒమాన్ , శ్రీలంక మరియు యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. ఈ 8 దేశాల్లో ఈ చిత్రం నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఇలా గతం లో ‘#RRR’, ‘పుష్ప 2’ వంటి చిత్రాలకు మాత్రమే జరిగింది.
ఇక మిగిలిన 12 దేశాల్లో అత్యధిక శాతం టాప్ 5 లేదా టాప్ 3 స్థానాల్లో ట్రెండ్ అవుతుంది. టాప్ 5 లో కాకుండా టాప్ 10 లో ట్రెండ్ అవుతున్న దేశాల లిస్ట్ చూస్తే అందులో సౌదీ అరేబియా ని తీసుకోవచ్చు. ఇక్కడ ఈ చిత్రం 10వ స్థానం లో ట్రెండ్ అవుతుంది. ఆ తర్వాత సింగపూర్ లో 7 వ స్థానం లో ,ఆస్ట్రేలియా లో 9 వ స్థానంలో, కెన్యా లో 7 వ స్థానం లో, కువైట్ లో 6 వ స్థానం లో, మాల్టా లో 10 వ స్థానం లో ట్రెండ్ అవుతుంది. తెలుగు ఆడియన్స్ తో పాటు, తమిళం, హిందీ, మలయాళం ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని ఎగబడి చూడడం వల్లే ఈ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి వారంలోనే 60 లక్షల వ్యూస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే ఇండియా లోనే ఆల్ టైం రికార్డు వ్యూస్ ని సాధించిన సినిమా గా నిలుస్తుంది.
Day 1 – Trending in 13 countries
Day 2 – Trending in 18 countries #OG growing bigger day by day like fine wineNew regions with strong Tamil & Malayalam audiences – Singapore, Malaysia & Saudi Arabia joined the charts yesterday pic.twitter.com/vaKrU2QcJB
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) October 26, 2025