Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu : మంత్రుల పనితీరుపై మదింపు.. ర్యాంకులు.. చంద్రబాబు సీరియస్!

CM Chandrababu : మంత్రుల పనితీరుపై మదింపు.. ర్యాంకులు.. చంద్రబాబు సీరియస్!

CM Chandrababu :  ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. మంత్రివర్గం కూడా చురుగ్గా పనిచేస్తోంది. నెలలో.. ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించింది.అందులో భాగంగా ఈరోజు మంత్రివర్గ భేటీ జరగనుంది.పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. అమరావతి తో పాటుగా పరిశ్రమలకు భూ కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలుపై సైతం నిర్ణయం తీసుకోనున్నారు. జనవరిలో కొత్త రేషన్ కార్డుల మంజూరు పైన మంత్రివర్గంలో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. సంక్రాంతికి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై సైతం ఏదో ఒక నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇదే సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు, ప్రోగ్రెస్ రిపోర్టులు ఇవ్వనున్నారు. దీంతో ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యతను దక్కించుకుంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో 24 మంది మంత్రులు ఉన్నారు. మంత్రుల నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్నారు. మంత్రుల్లో 20 మంది టిడిపి ఎమ్మెల్యేలు, ముగ్గురు జనసేన ఎమ్మెల్యేలు, బిజెపి నుంచి ఒకరు ఉన్నారు.

* పదిమంది కొత్తవారు
అయితే ఈ క్యాబినెట్లో పదిమంది మంత్రులు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారే. అందుకే మూడు నెలల పాటు వారికి గడువు ఇచ్చారు సీఎం చంద్రబాబు. శాఖల ప్రగతి తెలుసుకోవడంతో పాటు విధుల విషయంలో సైతం అన్ని అంశాలపై అవగాహన పొందాలని సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం కొలువుదీరి ఏడు నెలలు అవుతున్న తరుణంలో.. మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఆరు నెలల పనితీరుపై ర్యాంకులు కూడా ఖరారు చేశారు. మంత్రులుగా పనితీరుపై నివేదికల ఆధారంగా వారికి మార్పులు ఇచ్చారు. ప్రస్తుత మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం పవన్, లోకేష్ పని తీరు సమర్థవంతంగా ఉందని.. సీఎం కు అందిన నివేదికల ఆధారంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది.

* చంద్రబాబు దిశా నిర్దేశం
మంత్రివర్గంలో సీనియర్లతో పాటు జూనియర్లు కూడా ఉన్నారు. పొంగూరు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, సత్య కుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాసులు తమ శాఖల నిర్వహణలో ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. తొలి మూడు నెలల్లో హోంమంత్రి వంగలపూడి అనిత రెండు స్థానంలో ఉండగా… గత రెండు నెలల కాలంలో వెనుకబడ్డారని తెలుస్తోంది. మంత్రివర్గంలోకి నాగబాబు ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. దీనిపై ఈ సమావేశంలోనే ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. కొంతమంది మంత్రుల వ్యవహార శైలి పై సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఈ సమావేశంలో వారికి సుతిమెత్తగా హెచ్చరించే పరిస్థితి ఉంది. ఆరు నెలల పాలన ముగియడంతో పనితీరు మెరుగుపరుచుకోవడం పై మంత్రులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular