Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu goes abroad: విదేశాలకు చంద్రబాబు.. క్రికెట్ మ్యాచ్లలో లోకేష్.. జగన్ కు అదే మైనస్!

Chandrababu goes abroad: విదేశాలకు చంద్రబాబు.. క్రికెట్ మ్యాచ్లలో లోకేష్.. జగన్ కు అదే మైనస్!

Chandrababu goes abroad: వైయస్ జగన్మోహన్ రెడ్డికి ( YS Jagan Mohan Reddy ) ఏది ఇబ్బంది పెట్టిందో.. అదే అంశంపై ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. అనవసరంగా ప్రజల్లో ఉన్న భావోద్వేగాలను బయటకు తెస్తున్నారు. వైసీపీ హయాంలో పారిశ్రామిక అభివృద్ధి జరగలేదన్నది ఒక విమర్శ. ఉన్న పరిశ్రమలను సైతం బయటకు పంపించారన్న ఆరోపణ ఉంది. ఐదేళ్ల వైసిపి పాలనలో కనీసం పరిశ్రమలు రాలేదన్న విమర్శలు అధికం. కనీసం విదేశాలకు వెళ్లి పరిశ్రమలను తెప్పించే ప్రయత్నం జరగలేదన్నది ప్రధాన విమర్శ. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి అన్నది వాస్తవం. అయితే ఇప్పుడు దానిపై జగన్ మాట్లాడుతున్నారు. చంద్రబాబు విదేశాలకు వెళ్తాడు.. ఆయన కుమారుడు క్రికెట్ మ్యాచ్లు చూస్తాడు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. తద్వారా తటస్తులు, విద్యాధికులు జగన్మోహన్ రెడ్డి పై రియాక్ట్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటనలు సొంత పార్టీ నేతలకు నచ్చవచ్చు కానీ.. కనీస పరిజ్ఞానం, సామాజిక అవగాహన ఉన్న వారికి మాత్రం రుచించడం లేదు.

అప్పట్లో ఈ ప్రయత్నం ఏది?
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) హయాంలో జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలు చేశారు. ఎక్కువగా వ్యక్తిగత పర్యటనలకే పరిమితం అయ్యేవారు. కుమార్తెల విద్యకు సంబంధించిన కార్యక్రమాలకు, వేసవిలో సేద తీరేందుకు మాత్రమే విదేశాలకు వెళ్లేవారు. కనీసం విదేశీ సంస్థలు, పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అయిన సందర్భాలు కూడా లేవు. ఆ ప్రయత్నాలు కూడా జరిపిన దాఖలాలు లేవు. పెట్టుబడుల సదస్సులు నిర్వహించిన పరిస్థితి లేదు. ఒకటి రెండు సార్లు విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించి.. అప్పటికే పెట్టుబడులు పెట్టిన దేశీయ సంస్థలతో ఒప్పందాలు జరుపుకున్నారు. దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లిన దాఖలాలు కూడా లేవు. మరోవైపు అమర్ రాజా వంటి పరిశ్రమలను తరిమేసారన్న ఆరోపణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఉంది.

సంక్షేమంతో సరిపెట్టిన జగన్..
అమ్మ పెట్టదు.. తిననివ్వదు అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ప్రజలకు అంతులేని సంక్షేమం ఇచ్చానని భావించారు ఆయన. ఇక పరిశ్రమలతో పని ఏముంది అన్నట్టు వ్యవహరించారు. పెద్ద ఎత్తున పరిశ్రమలను తెచ్చే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్. అధికారంలోకి వచ్చింది మొదలు తరచూ విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. పారిశ్రామిక పెట్టుబడులు తెస్తున్నారు. వారి విదేశీ పర్యటనకు సంబంధించిన ఫలితాలు కూడా వస్తున్నాయి. గతంలో లండన్ లో పర్యటించారు నారా లోకేష్. దాని పర్యవసానాలే విశాఖకు క్యూ కడుతున్న ఐటి సంస్థలు. చంద్రబాబు సైతం నేరుగా దిగ్గజ పారిశ్రామికవేత్తలను కలిసి వారిని ఆహ్వానిస్తున్నారు. వారు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈనెల 14 నుంచి మూడు రోజులపాటు విశాఖ వేదికగా జరగబోయే పెట్టుబడుల సదస్సులో.. భారీగా ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉంది.

ప్రజల్లోకి ఆ ప్రయత్నాలు..
సీఎం చంద్రబాబు తో( CM Chandrababu) పాటు మంత్రి నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ప్రజలకు కనిపిస్తున్నాయి. ఒకవైపు పాలనను గాడిలో పెడుతూనే పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి పెట్టారు చంద్రబాబు. కానీ ఒక్క సంక్షేమాన్ని నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తాను చేయలేకపోయింది చంద్రబాబు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు విదేశీ పర్యటనలపై జగన్ చేస్తున్న కామెంట్స్ ప్రజల్లో నిలబడడం లేదు. మరోవైపు క్రీడారంగం అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టారు మంత్రి లోకేష్. అందులో భాగంగా ఐసీసీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. మహిళా క్రికెట్కు సంబంధించి వరల్డ్ కప్ ఆతిథ్యాన్ని ఏపీలో ఏర్పాటు చేశారు. ప్రారంభ మ్యాచ్ విశాఖ వేదికగా జరగగా వేడుకగా కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. ఫైనల్ మ్యాచ్ తిలకించి క్రికెట్ అభివృద్ధికి సుమాలోచనలు చేశారు లోకేష్. దానిని కూడా జగన్మోహన్ రెడ్డి తేలికగా తీసుకున్నారు. ఏదో క్రికెట్ చూస్తున్నాడు అంటూ విమర్శలు చేశారు. అవి సైతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మైనస్ గా మారుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version