Chandrababu BJP: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. రాజ్యసభ పదవుల ఎంపికలో చంద్రబాబు తన వ్యూహాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా బిజెపి హై కమాండ్ ను ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి బిజెపికి ఎటువంటి కేటాయింపులు లేవు. తెలుగుదేశం పార్టీకి మూడు, జనసేనకు ఒక పదవి సర్దుకొనున్నారు. బిజెపి విషయంలో ఇప్పటికే కేంద్ర పెద్దలతో చర్చించి వారిని ఒప్పించారు. ప్రాంతీయ అవసరాల దృష్ట్యా ఈసారి తమకు విడిచి పెట్టాలని చంద్రబాబు చేసిన విన్నపానికి కేంద్ర పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో టీడీపీ నుంచి ముగ్గురికి, జనసేన నుంచి ఒకరికి రాజ్యసభ పదవి దక్కడం ఖాయమని తెలుస్తోంది.
* రెండుసార్లు బిజెపికి ఛాన్స్..
కూటమి వచ్చిన తర్వాత రాజ్యసభ ఎన్నికలు రావడం ఇది మూడోసారి. ఇప్పటివరకు ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక జరిగితే అందులో రెండు పదవులు బిజెపి దక్కించుకుంది. మరో రెండు పదవులు టిడిపికి వచ్చాయి. జనసేనకు ఇంతవరకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. గతంలో రాజ్యసభలో బిజెపికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణం ఎగువ సభలో ఆ పార్టీకి తక్కువ మంది సభ్యులు ఉండడమే కారణం. అందుకే అప్పట్లో హై కమాండ్ విజ్ఞప్తి మేరకు బిజెపికి ప్రాధాన్యమిచ్చారు చంద్రబాబు. లోక్సభలో బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ మెజారిటీ ఉంది. కానీ రాజ్యసభలో మాత్రం కాంగ్రెస్ దాని మిత్రపక్షాల బలం ఎక్కువ. అందుకే బీజేపీ విజ్ఞప్తి మేరకు రెండుసార్లు రాజ్యసభ పదవులు ఇచ్చారు. అయితే ఇప్పుడు పది రాష్ట్రాల నుంచి 24 మంది రాజ్యసభ సభ్యులు ఎంపిక కానుండడం.. అందులో బీజేపీ కి ఎక్కువ స్థానాలు రానుండడంతో.. ఏపీ నుంచి వదులుకునేందుకు బిజెపి సిద్ధపడింది.
* తొలిసారిగా జనసేనకు..
రాజ్యసభలో తొలిసారిగా జనసేనకు ప్రాతినిథ్యం దక్కనుంది. గతంలో రెండుసార్లు రాజ్యసభ పదవులు వచ్చినప్పుడు జనసేన త్యాగం చేసింది. ఈసారి మాత్రం ఆ పార్టీకి ఒక ఛాన్స్ రానుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు ఖరారు అయ్యే అవకాశం ఉంది. టిడిపిలో అయితే ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ బీసీ కోటాలో పదవి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహిళకు ఒక రాజ్యసభ ఇచ్చేందుకు లోకేష్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సానా సతీష్ రాజ్యసభ సభ్యుడుగా ఉంటూ ఏడాదిన్నరకే పదవీ విరమణ చేశారు. ఆయనకు మరోసారి ఛాన్స్ ఇస్తారు. మొత్తానికైతే బీజేపీని చంద్రబాబు అలా తెగ్గొట్టారు.
