YCP: కేంద్ర ప్రభుత్వం( central government) ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సభ్యుల హాజరు విధానంపై సమూల మార్పులు తీసుకొచ్చేందుకు స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు. పార్లమెంట్ అంటేనే ప్రజాస్వామ్య దేవాలయం అనే అర్థం. అక్కడ అర్థవంతమైన చర్చలు జరుగుతాయి కాబట్టి సభ్యులంతా విధిగా ఉండాల్సిందే. అయితే చాలామంది సభ్యులు పార్లమెంట్ సమావేశాలకు సరిగా హాజరు కావడం లేదు. ప్రజా సమస్యలపై జరుగుతున్న చర్చలో పాల్గొనడం లేదు. దీంట్లో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు స్పీకర్. అయితే ఇప్పటివరకు సభ బయట ఉండే హాజరు ప్రక్రియను.. ఈసారి లోపలకు మార్చుతున్నారు. సభ్యుడు తన సీట్లో కూర్చున్న తరువాత మాత్రమే హాజరు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదో సభకు హాజరు అయి అలా వెళ్ళిపోతాం అంటే కుదరదు. అయితే పార్లమెంట్లో పెడితే అన్ని శాసనసభల్లో కూడా ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది. అయితే ఈ విధానంతో వైసీపీని కేంద్రం ఇబ్బందుల్లో పెట్టినట్టే.
* సభకు రాకుండానే జీతాలు..
వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress) పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరు కావడం లేదు. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. టెక్నికల్ గా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు. అయితే హోదా ఇస్తే కానీ శాసనసభకు హాజరు కాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ క్రమంలో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు రిజిస్టర్లో సంతకాలు పెట్టి జీతాలతో పాటు అలవెన్సులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పార్లమెంటు లోపల హాజరు విధానాన్ని అనుసరించి అసెంబ్లీలో పెడితే.. వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
* ఎథిక్స్ కమిటీ సమావేశం..
వైసీపీ ఎమ్మెల్యేలపై చర్చించేందుకు అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ( assembly ethics committee ) సమావేశం అయింది. సభకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్న వారి పై చర్చించారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా ఎమ్మెల్యేలంతా సభకు హాజరు కాకుండానే జీతభత్యాలు తీసుకోవడం పై చర్చలు జరిపారు. వీరిపై అనర్హత వేటు విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రజల్లో కూడా దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వీరిని ఇరుకున పెట్టే విధంగా లోక్సభ స్పీకర్.. సభ్యుల హాజరు విధానంలో మార్పులు తీసుకురావడం అనేది ఇబ్బందికరమే. కచ్చితంగా దీనిపై ఏపీలో మరోసారి చర్చ జరుగుతుంది. వైసిపి చుట్టూ ఈ చర్చ సాగుతుంది.