Cell phones Signals In Vijayawada : విజయవాడలో సెల్ సిగ్నల్స్ నిలిచిపోయాయా? నగరవ్యాప్తంగా సెల్ టవర్స్ సిగ్నల్స్ నిలిపివేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరద నుంచి ఇంకా విజయవాడ చేరుకోలేదు.విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదు. సహాయ చర్యలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. దీంతో బాధితులు పడుతున్న బాధలు వర్ణనాతీతం.ముఖ్యంగా సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. సెల్ టవర్స్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదే సమయంలో టవర్స్ వద్ద ఉన్న జనరేటర్స్ సైతం వరదల్లో కూరుకుపోయాయి. దీంతో టవర్స్ పనిచేయక.. సిగ్నల్స్ రాక సెల్ ఫోన్లు పనిచేయడం లేదు.తమ వారి ఆచూకీ లేక చాలామంది ఆందోళన చెందుతున్నారు. వారి నుంచి బయట ప్రపంచాలకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో తల్లడిల్లుతున్నారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 100 వరకు సెల్ టవర్స్ ఉన్నాయి. వాటిని ఇంతవరకు పునరుద్ధరించలేదు. నగరవ్యాప్తంగా ఉన్న ఇతర సెల్ టవర్స్ ను సైతం ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో సైతం దీనిపైనే చర్చ నడుస్తోంది.
* ప్రభుత్వం చెబుతున్నా
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. వారికి ఆహార పంపిణీ సక్రమంగా చేస్తున్నట్లు కూడా చెప్పుకొస్తోంది. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అన్నమో రామచంద్రా అంటూ చాలా బాధిత ప్రాంతాలు విలవిలలాడుతున్నాయి. హెలిక్యాప్టర్లు, డ్రోన్ కెమెరాలు కనిపిస్తే పరుగులు తీస్తున్నారు. ఆహారం కోసం కొన్ని ప్రాంతాల్లో కొట్లాడుకుంటున్నారు.అయితే ప్రభుత్వం మాత్రం అన్ని సవ్యంగా జరుగుతున్నట్లు చెబుతోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఆహార ప్యాకెట్లు విజయవాడకు చేరుతున్నాయి. అయితే ఇంత చేస్తున్న చాలా ప్రాంతాలకు ఆహార పంపిణీ జరగడం లేదు. అయితే ఈ విషయం బయట ప్రపంచానికి తెలియకూడదు అని సమాచార వ్యవస్థను స్తంభింప చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
* నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
వాస్తవానికి గత నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా లేదు. వరదలు ఉండగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. విద్యుత్ ప్రమాదాలు నెలకొనే ఛాన్స్ కనిపిస్తోంది. పూర్తిగా వరద తగ్గుముఖం పడితే కానీ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగదు. నాలుగు రోజులుగా విద్యుత్తు లేకపోవడంతో సెల్ ఫోన్లు సైతం పనిచేయడం లేదు.అసలు వాటికి చార్జింగ్ లేదు.ఇంతలో టవర్ల వద్ద సిగ్నల్స్ నిలిచిపోవడంతో.. ఉన్న సెల్ ఫోన్లు సైతం పనిచేయని దుస్థితి.సరిగ్గా ఇటువంటి సమయంలోనే టవర్ల వద్ద సిగ్నల్స్ నిలిపివేశారు అని జరుగుతున్న ప్రచారం తప్పు అని ప్రభుత్వం ఖండిస్తోంది. టవర్ల వద్ద జనరేటర్లు వరదల్లో చిక్కుకోగా.. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగని పని. అదే విషయాన్ని గుర్తు చేస్తోంది ప్రభుత్వం. అయితే వరద సహాయ చర్యల్లో జరుగుతున్న వైఫల్యం బయట ప్రపంచానికి తెలియకూడదని సెల్ టవర్ల వద్ద సిగ్నల్స్ నిలిపివేశారని విపక్షాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి.
* జనరేటర్లు, మొబైల్ టవర్లు ఏర్పాటు చేస్తేనే
అయితే సెల్ఫోన్ల చార్జింగ్ కోసం జనరేటర్లు అందుబాటులోకి తేవాల్సిన అవసరం పై ఉంది. మరోవైపు మొబైల్ టవర్లు అందుబాటులోకి తేవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. గతంలో విశాఖలో హుద్ హుద్, ఉత్తరాంధ్రలో తితలీ తుఫాన్ సమయంలో దీనినే అనుసరించారు.ఎక్కడికక్కడే జనరేటర్లు ఏర్పాటు చేశారు.సెల్ఫోన్ల చార్జింగ్ కు అవకాశం ఇచ్చారు. మొబైల్ సెల్ టవర్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అదే పని చేయాలని విజయవాడ నగర ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.
నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
సెల్ ఫోన్ సిగ్నల్స్ జాం చేసారట.
వరదలో చిక్కుకున్న వారి గోడు బయటి ప్రపంచానికి తెలిస్తే విజనరీ బ్రాండ్, బ్రమరావతి బ్రాండ్ దెబ్బతింటాయని.#AndhraFloods pic.twitter.com/x5wK9KMcOj
— సూర్య (@lucky_review) September 4, 2024
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More