YCP Fake Campaign : సోషల్ మీడియా విస్తృతమవుతోంది. ప్రజల్లోకి బలంగా చేరే సాధనంగా మారింది. అందుకే దుర్వినియోగం అవుతోంది. ప్రత్యర్థులపై వ్యక్తిగత హననం, వ్యతిరేక ప్రచారానికి వేదికగా మారింది. ముఖ్యంగా రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రవేశించాక.. ఎక్కువ శాతం దుర్వినియోగం అవుతోంది. అయితే తప్పులను ఎత్తిచూపడం వరకు తప్పులేదు కానీ.. తప్పుడు ప్రచారం జరుగుతుండడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే ఇటువంటి ప్రచారానికి చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ముఖ్యంగా వైసిపి ఫేక్ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. తప్పుడు ప్రచారాలు చేయడం, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించడం దగ్గర నుంచి మహిళలపై అసభ్యంగా మాట్లాడే వారి వివరాలను తెలుసుకునే పనిలో పడింది ఏపీ పోలీస్. దాదాపు100కు పైగా అకౌంట్లను గుర్తించింది. ఆదివారం ఒక్క రోజే ఏకకాలంలో కేసులు నమోదు చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి ఫేక్ సోషల్ మీడియా ఎకౌంట్ల పై చర్యలు ఉంటాయని అంతా భావించారు. కానీ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ వచ్చింది కూటమి ప్రభుత్వం. అయితే ఇటీవల ఈ ఫేక్ ప్రచారం అధికం కావడంతో స్పందించాల్సి వచ్చింది. కఠిన చర్యలకు ఉపక్రమించనున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా మాటున చాలామంది ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టాలనుకున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో పాటుగా మహిళా మంత్రుల ఫోటోలను వదలకుండా మార్ఫింగ్ చేశారు. అటువంటి వారిపై ఇప్పుడు కేసులు నమోదు అవుతుండడంతో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
* వైసిపి సోషల్ మీడియా యాక్టివ్
వైసీపీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. పార్టీ ఆవిర్భావం నుంచి బలమైన సోషల్ మీడియా ఆ పార్టీ కోసం పని చేస్తూ వస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐప్యాక్ తో సమానంగా సోషల్ మీడియా విభాగం పనిచేసింది. రాష్ట్రస్థాయిలో సోషల్ మీడియా పనిచేయక.. వైసీపీ మంత్రులు, కీలక నేతలు సైతం సొంతంగా సోషల్ మీడియాను అపాయింట్ చేసుకున్నారు. అయితే గత ఐదేళ్లలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వైసీపీ నేతలు ఇప్పుడు కనిపించకుండా పోయారు.
* మారిన నాయకత్వం
ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా విభాగానికి సంబంధించి నాయకత్వం మారింది. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి పనిచేసేవారు. ఇప్పుడు ఆయనను మార్చారు. వైసీపీలో యాక్టివ్ గా ఉండే వాళ్లంతా సోషల్ మీడియాలో సైతం క్రియాశీలకం కావాలని అధినేత జగన్ ఇటీవల పిలుపునిచ్చారు. అటువంటి వారికి అధికారంలోకి వచ్చాక ప్రత్యేక గుర్తింపు ఇస్తామని కూడా చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా వింగ్ పెరిగింది. ఎక్కువమంది వైసిపి శ్రేణులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో.. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ప్రారంభమైంది. ఇటీవల పతాక స్థాయిలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో మహిళలు అని కూడా చూడడం లేదు కొందరు. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోంది. ఒకే రోజు వందలాది ఖాతాలపై కేసులు నమోదు చేశారు. మున్ముందు మరింత మందిపై నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Cases have been registered on social media accounts of ycp for morphing photos of cm chandrababu deputy cm pawan and women ministers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com