Vallabhaneni Vamsi: వైసీపీ ఫైర్ బ్రాండ్లలో వల్లభనేని వంశీ ఒకరు. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ.. అదే పార్టీ అధినేత చంద్రబాబుకు చుక్కలు చూపించారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. నిండు శాసనసభలో ఆయనను అవమానించారు కూడా. ఏకంగా చంద్రబాబు సతీమణి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దారుణంగా అవమానించారు. జూనియర్ ఎన్టీఆర్ సిఫారసులతో 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు వల్లభనేని వంశీ. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గన్నవరం నుంచి విజయం సాధించారు. అయితే 2014 నుంచి 2019 వరకు తన విధేయతను ప్రదర్శించుకుంటూ వచ్చారు. తన స్నేహితుడు కొడాలి నాని ఒత్తిడి చేసినా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 2019 ఎన్నికల్లో సైతం టిడిపి అభ్యర్థిగానే పోటీ చేసి గెలిచారు. అయితే రాష్ట్రంలో వైసిపి అధికారం లోకి రావడంతో ఆయన స్వరం మారింది. కొద్ది రోజులకే టిడిపిని విభేదించి వైసిపి పంచన చేరారు. అది మొదలు చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు. జగన్ వ్యూహాత్మకంగా వల్లభనేని వంశీని చంద్రబాబుపై ప్రయోగించారు. ఈ క్రమంలో ఆయన చంద్రబాబు కుటుంబం పై కూడా వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పై నిత్యంషాకింగ్ కామెంట్స్ చేసేవారు. అయితే ఈ ఎన్నికల్లో వల్లభనేని వంశీ ఓడిపోయారు. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వల్లభనేని వంశీ విదేశాలకు పారిపోయారని ప్రచారం సాగింది. అయితే ఆయన మాత్రం ఇక్కడే ఉంటూ కనిపించడం ప్రారంభించారు. దీంతో కూటమి ప్రభుత్వం ఆయనపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. తాజాగా గన్నవరంలో టిడిపి కార్యాలయం పై దాడి కేసును తెరపైకి తెచ్చింది. ఏకంగా ఆ కేసును సిఐడి కి అప్పగించింది.
* యార్లగడ్డ వెంకట్రావు తో చెక్
గన్నవరం నుంచి పోటీ చేసి తనపై గెలవాలని చంద్రబాబుతో పాటు లోకేష్ కు పలుమార్లు సవాల్ చేశారు వల్లభనేని వంశీ. అయితే అనూహ్యంగా చంద్రబాబుకు సరైన అభ్యర్థి దొరికారు. అప్పటివరకు వైసీపీలో కొనసాగిన యార్లగడ్డ వెంకట్రావును టిడిపిలోకి రప్పించారు. ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించి.. వల్లభనేని వంశీని దారుణంగా దెబ్బ కొట్టారు. 2024 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని వల్లభనేని వంశీ భావించారు. కానీ గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఆయనను తిరస్కరించారు. అయితే నాడు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ పై రివెంజ్ కు ఇప్పుడు సరైన ప్లాన్ చేసింది కూటమి ప్రభుత్వం. ఏకంగా ఆయన కేసును సిఐడి కి అప్పగించింది. దీంతో వల్లభనేని వంశీ చుట్టు ఉచ్చుబిగించడం ఖాయంగా తేలింది.
* రకరకాలుగా ప్రచారం
ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వల్లభనేని వంశీ జాడ లేకుండా పోయింది.ఆయన విదేశాలకు పారిపోయారని ప్రచారం జరిగింది. ఎన్నికల పోలింగ్ తర్వాత కూడా ఇదే తరహా టాక్ నడిచింది. ఓటమిని ముందే గమనించిన వల్లభనేని వంశీ అమెరికా పారిపోయారని.. ఇక రారా అని కూడా తెగ ప్రచారం నడిచింది. అయితే సరిగ్గా కౌంటింగ్ మొదలవుతుందనగా వల్లభనేని వంశీ ప్రత్యక్షమయ్యారు. ఓటమి తర్వాత ఎవరికి కనిపించకుండా పోయారు. ఈ క్రమంలోనే నాడు టిడిపి కార్యాలయం పై దాడి కేసు బయటకు వచ్చింది. ఆయన కోసం ఏపీ పోలీసులు హైదరాబాద్ ను జల్లెడ పట్టారని కూడా అప్పట్లో ఒక రకమైన ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు ఆ కేసును ఏకంగా సిఐడి కి అప్పగించడం.. వల్లభనేని వంశీ కోసమేనని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అప్పటి నోటి దూలకు.. ఇప్పుడు వంశీ మూల్యం చెల్లించుకునే సమయం ఆసన్నమైందన్న టాక్ నడుస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Case of attack on tdp office to cid
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com