JC Prabhakar Reddy
JC Prabhakar Reddy: కూటమిలో( allians) మరో రాజకీయ దుమారానికి తెరలేచింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి పై( JC Prabhakar Reddy ) సినీనటి, బిజెపి నేత మాధవి లత చేసిన ఫిర్యాదు పై కేసు నమోదు అయింది. తనపై జెసి ప్రభాకర్ రెడ్డి అనుచరులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని.. సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారని గత నెల 21న సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మాధవి లత. దీనిపై జెసి ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. దీంతో ఇది కూటమి మధ్య సమన్వయ లోపానికి దారితీస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొద్దిరోజులుగా జెసి ప్రభాకర్ రెడ్డి, నటి మాధవి లత మధ్య గట్టి వివాదమే నడుస్తోంది. ఒకానొక దశలో దీనిపై జెసి ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. సినీనటి మాధవి లతకు క్షమాపణలు కూడా కోరారు. అయితే అంతటితో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఏకంగా మాధవి లత జెసి ప్రభాకర్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేయడం.. కేసు నమోదు కావడం జరిగిపోయింది.
* నూతన సంవత్సర వేడుకలతో..
తాడిపత్రిలో నూతన సంవత్సర వేడుకలను ఏర్పాటు చేశారు జెసి ప్రభాకర్ రెడ్డి. మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అయితే ఈ వేడుకలపై అప్పట్లో సినీనటి, బిజెపి నేత మాధవి లత( actor Madhavi Latha ), మరో మహిళా నేత యామిని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో జెసి ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా రెచ్చిపోయారు. తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సినీనటి మాధవి లత నువ్వు ఉద్దేశించి ప్రాస్టిట్యూట్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో అక్కడి నుంచి వివాదం ప్రారంభం అయ్యింది. బిజెపి నేతలు జెసి ప్రభాకర్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు సినీ పరిశ్రమ నుంచి సైతం అనేక రకాల కామెంట్స్ వచ్చాయి. దీంతో జెసి ప్రభాకర్ రెడ్డి స్పందించాల్సి వచ్చింది. 73 ఏళ్ల వయసులో తాను ఆ వ్యాఖ్య చేసి ఉండేది కాదని.. అందుకే క్షమాపణలు చెబుతున్నానని కోరారు. కానీ బిజెపి నేతల విషయంలో సైతం ఎక్కడ వెనక్కి తగ్గలేదు జెసి ప్రభాకర్ రెడ్డి. అయితే ఈ పరిణామాల క్రమంలో జెసి ఫ్యామిలీకి చెందిన ఓ బస్సు అనంతపురంలో దగ్ధం కావడం మరింత సంచలనానికి కారణం అయింది.
* రాయలసీమలో బిజెపి వర్సెస్ జెసి
అయితే రాయలసీమలో( Rayalaseema ) బీజేపీ వర్సెస్ జెసి అన్నట్టు పరిస్థితి మారింది. ఆ మధ్యన బూడిద పంచాయతీ నడిచింది. బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్సెస్ జెసి ప్రభాకర్ రెడ్డి అన్నట్టు పరిస్థితి మారింది. దీంతో ఏకంగా ఈ పంచాయతీ ముఖ్యమంత్రి కార్యాలయం వరకు చేరింది. చంద్రబాబు సముదాయించడంతో అంతా సద్దుమణిగింది. మరోవైపు సినీనటి మాధవీలతో వివాదం సైతం మరుగున పడిందని అంతా భావించారు.అయితే గత కొంతకాలంగా జెసి ప్రభాకర్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో తనను వెంటాడుతున్నారని మాధవి లత గత నెల 21న తెలంగాణలోని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు
అయితే ఈరోజు ఉదయం జేసీ ప్రభాకర్ రెడ్డి ( JC Prabhakar Reddy )పై కేసు నమోదు అయినట్లు సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఇది సంచలన అంశంగా మారిపోయింది. వివాదం ఫుల్ స్టాప్ పడిందని భావిస్తే.. మరోసారి వెలుగు చూడడం కూటమి పార్టీల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే రాయలసీమలో వరుసగా జరుగుతున్న పరిణామాలు కూటమి పార్టీల్లో ఒక రకమైన కలవరానికి కారణం అవుతున్నాయి. ఎక్కడ మూడు పార్టీల మధ్య విభేదాలు వస్తాయి అని ఆందోళనతో ఉన్నారు. వీలైనంతవరకూ ఇటువంటి వివాదాలకు చెక్ వేయాలని కోరుతున్నారు.