CAG : ఏపీలో అప్పుల పై ఫుల్ క్లారిటీ వచ్చింది. రాష్ట్రంలో రోజురోజుకు అప్పులు పెరుగుతున్నాయని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.తాజాగా కాగ్ తన లెక్కలను బయటపెట్టింది. పాలు తాగే పసికందు నుంచి పండు ముసలి వరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర జనాభా మీద ఉన్న అప్పు భారం ఎంత అన్న విషయాన్ని లెక్క కట్టింది.కాగ్ తాజా లెక్కల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తలసరి అప్పు ఒక్కో తలమీద రూ.1,03,758గా తేల్చింది. కాగా ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది 2018-19 నాటికి ఏపీలోని ఒక్కో తలపై ఉన్న అప్పు రూ.50,157 కాగా.. ఈ నాలుగేళ్ల వ్యవధిలో రెట్టింపు కావడం గమనార్హం.2019- 20 లో బడ్జెట్లో చూపని రుణాన్ని కూడా కలిపితే.. అప్పట్లో ఒక్కో తలపై రుణ భారం అక్షరాల రూ.73,525. రాబోయే ఏడేళ్ల వ్యవధిలో ఏపీ చెల్లించాల్సిన అప్పు అక్షరాల లక్ష 39వేల 567 కోట్ల రూపాయలు అన్నమాట.
* ప్రభుత్వాల మధ్య సంవాదం
అయితే అప్పుల విషయంలో రాజకీయ పార్టీల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. మీ ప్రభుత్వ హయాంలో అప్పులు పెరిగాయి అంటూ ఒకరు.. కాదు కాదు మీ హయాంలో పెరిగాయి అంటూ మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వాల పాపం ప్రజలకు శాపంగా మారింది. ఇప్పుడు ఈ అప్పులు తీర్చేందుకు అదనపు తిప్పలు పడాల్సి ఉంటుంది. గడిచిన ఐదేళ్లలో మూలధనం తక్కువగా లెక్క కట్టింది. కేంద్రం అమలు చేసిన పథకాలకు కేటాయించిన మొత్తాన్ని వినియోగించుకునే విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు కాగ్ తేల్చింది.
* ఆ రుణంలో అప్పులకే అధికం
అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుల్లో పాత రుణం తీర్చుకునేందుకు ఎక్కువ ఖర్చు అవుతోంది. 2022 -23 లో తీసుకున్న అప్పుల్లో 68.51% పాత రుణాలు తీర్చేందుకే సరిపోయిందని.. రాష్ట్రం ఎన్ని చెప్పినా అప్పు తీర్చే సామర్థ్యం రోజురోజుకు తక్కువ అవుతుందని కాగ్ స్పష్టం చేయడం విశేషం.జగన్ ప్రభుత్వంగత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 341 రోజులపాటు అప్పుల మీదనే ఆధారపడిందని కాగ్ వెల్లడించింది. ఆ ఏడాదిలో లక్ష 18 వేల 39 కోట్ల మొత్తాన్ని చే బదుల రూపంలో అప్పులు చేశారని..కానీ దానికి వడ్డీ కింద ఏకంగా 148 కోట్ల 60 లక్షలు చెల్లింపులు చేసినట్లు కూడా కాగ్ తేల్చి చెప్పడం విశేషం. మొత్తానికి అయితే అప్పులపై స్పష్టతనిచ్చిన కాగ్ వైసీపీ సర్కార్ వైఫల్యాలను బయట పెట్టడం విశేషం.