Homeఆంధ్రప్రదేశ్‌Borugadda Anil: బోరుగడ్డతో బిర్యాని.. పాపం ఆ ఏడుగురు పోలీసులు ఔట్

Borugadda Anil: బోరుగడ్డతో బిర్యాని.. పాపం ఆ ఏడుగురు పోలీసులు ఔట్

Borugadda Anil: వైసిపి హయాంలో రాజకీయ ప్రత్యర్థులపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్.ప్రస్తుతం ఆయనకు చుక్కలు కనిపిస్తున్నాయి. 50 లక్షలు బ్లాక్ మెయిల్ చేసిన కేసులు ఇప్పటికే ఆయన అరెస్టయ్యారు. రిమాండ్ లో ఉన్నారు. ఇదే అదునుగా ఆయనపై మరికొన్ని కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయనను తాజాగా కోర్టులో హాజరుపరచి పోలీసులు రిమాండ్కు తరలించే క్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పోలీసులపై వేటుపడడానికి కారణం అయ్యింది. వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ పై ఇప్పటికే 17 కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా మంగళగిరి కోర్టులో ఆయనను హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే మార్గ మధ్యలో గన్నవరంలో ఓ రెస్టారెంట్ వద్ద భోజనం కోసం ఆగారు. గన్నవరంలోని క్రాస్ రోడ్స్ రెస్టారెంట్ లో అనిల్ కు పోలీసులు రాజమర్యాదలు చేశారు. ఆయనతో కలిసి ఏడుగురు పోలీసులు బిరియాని తిన్నారు. అదే సమయంలో సెల్ ఫోన్ లో ఈ వీడియో తీస్తున్న పలువురు టిడిపి కార్యకర్తల ఫోన్లు లాక్కుని.. ఆ వీడియోను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై టిడిపి నేతలు హైకమాండ్ కు ఈ విషయం తీసుకెళ్లారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వీరంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

* తాజా పరిణామాలతో
ఇటీవల పోలీస్ శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఆరోపణలు వచ్చిన వెంటనే కఠిన చర్యలకు దిగుతున్నారు ఉన్నతాధికారులు. అయితే సాధారణంగా రిమాండ్ ఖైదీకి కోరిన భోజనం పెట్టాలన్న నిబంధన ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు పోలీసులు. అందుకే తాము బిర్యాని భోజనం పెట్టినట్లు చెబుతున్నారు. కానీ బోరుగడ్డ అనిల్ వంటి రౌడీషీటర్ కు రాచ మర్యాదలు ఏంటని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. దారుణంగా దూషించిన వ్యక్తిని ఏం చేయలేకపోయాం అన్న బాధ టిడిపి కూటమి నేతల్లో ఉంది.అటువంటి వ్యక్తికి ఇప్పుడు బిరియాని పెట్టి మర్యాదలు చేయడాన్ని వారు సహించలేకపోతున్నారు.పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.అదే విషయాన్ని పార్టీ అధినేతల దృష్టికి తీసుకెళ్లడంతో వారు కలుగజేసుకున్నారు.పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ఏడుగురు పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు.

* వరుస ఘటనలతో
ఇప్పటికే కడప జిల్లాకు చెందిన వార్రా రవీందర్ రెడ్డి విషయంలో పోలీసుల వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.వైసీపీ సోషల్ మీడియా విభాగంలో రవీందర్ రెడ్డి కీలక వ్యక్తిగా ఉన్నారు.ఆయన జగన్ సతీమణి భారతి వ్యక్తిగత సహాయకుడు కూడా.ఆయనను అదుపులోకి తీసుకున్నట్టే తీసుకొని.. 41 ఏ నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు.తరువాత కేసులో అరెస్టుకుప్రయత్నించగా ఆయన కనిపించకుండా పోయారు. దీంతో కడప ఎస్టి పై బదిలీ వేటు పడినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు బోరుగడ్డ బిర్యాని పుణ్యమా అని ఏడుగురు పోలీస్ సిబ్బందిపై వేటు పడింది. ఎప్పటికైనా పోలీస్ శాఖ ఉదాసీనంగా కాకుండా.. కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular