Jagan: ఏపీ విషయంలో ప్రధాని మోదీ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చేశారు. వైసీపీ అసలు గెలుస్తుందని అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మాట్లాడారు. ఏపీ విషయానికి వచ్చేసరికి కీలక అంశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. టిడిపి తో కూటమి కట్టిన సంగతి తెలిసిందే. అయితే టిడిపి తో పొత్తు బిజెపి అగ్ర నేతలకు ఇష్టం లేదని వైసిపి ప్రచారం చేసింది. మొన్నటికి మొన్న ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో బిజెపి అంటీ ముట్టనట్టుగా వ్యవహరించడంతో రకరకాల అనుమానాలు ప్రారంభమయ్యాయి. కానీ ఏపీ ఎన్నికల ప్రచార సభలకు వచ్చిన ప్రధాని మోదీ ఈ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశారు.వైసిపి సర్కార్ పై విరుచుకుపడ్డారు.ఇప్పుడు మరోసారి వైసీపీకి అనుకూల మీడియా అయిన ఎన్ టీవీ ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
గత ఎన్నికలకు ముందు ఎన్ డి ఏ నుంచి బయటకు వెళ్లిపోయారు చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీతో జత కలిశారు. దేశవ్యాప్తంగాప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కానీ ఏపీలో దెబ్బతిన్నారు. చంద్రబాబు ఓటమి వెనుక కేంద్ర పెద్దల సాయం జగన్ కు అందింది అన్నది బహిరంగ రహస్యం. గత ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురయ్యేసరికి చంద్రబాబుకు తత్వం బోధపడింది. అటు జగన్ సైతం ఎన్డీఏలో చేరకుండానే అంతకుమించి రాజకీయ లబ్ధి బిజెపి నుంచి పొందగలిగారు. అదే సమయంలో బిజెపితో జతకట్టేందుకు ప్రయత్నించిన టిడిపికి అగ్ర నేతలు అవకాశం ఇవ్వలేదు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బిజెపి అగ్ర నేతలు అంగీకరించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలోటిడిపి,బిజెపిల మధ్య గ్యాప్ పెరిగిందని.. చంద్రబాబు విషయంలో బిజెపి అగ్రనేతల అభిప్రాయం మారలేదని వైసీపీ ప్రచారం చేసింది. అయితే వాటన్నింటిపై ప్రధాని మోదీతాజాగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కొద్ది రోజుల కిందట ఏపీలో వరుస ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.చంద్రబాబుతో వేదిక పంచుకున్నారు.జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు.అసలు జగన్కు పాలన రాదన్నారు.అదే సమయంలో చంద్రబాబును వెనుకేసుకొచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీవీ ఇంటర్వ్యూలో సైతం వైసీపీ ప్రభుత్వ పాలనను తప్పు పట్టారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని తేల్చి చెప్పారు. జగన్ తమకు ఎప్పుడు మిత్రపక్షం కాదన్న విషయాన్ని ప్రస్తావించారు. దివంగత ఎన్టీఆర్ ఉన్నప్పటినుంచి టిడిపి తమకు నమ్మదగిన మిత్రపక్షంగా కూడా తేల్చేశారు. అయితే వైసీపీకి అనుకూలంగా ఉన్న ఎన్ టీవీలో ఈ విషయాలన్నింటిపై ప్రధాని మోదీ ఫుల్ క్లారిటీ ఇవ్వడం పక్కా వ్యూహంగా తెలుస్తోంది. ఎన్నికల ముంగిట ఏపీలో కూటమికి పాజిటివ్ పంపించేందుకు ఈ ప్రయత్నం చేశారన్నది వైసిపి అనుమానిస్తోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.