Vizag Traffic Challan: విశాఖలో( Visakhapatnam) సెగలు పుట్టిస్తున్నారు పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. హెల్మెట్ లేకుంటే భారీ జరీమానాలు విధిస్తున్నారు. లైసెన్సు లేని వాహనదారుల నుంచి సైతం ఫైన్ వసూలు చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనానికి జరిమానా విధించడంతో.. సదరు వాహనదారుడు ట్రాఫిక్ పోలీస్ తో వాదనకు దిగాడు. ఎందుకు ఫైన్ కట్టాలి అంటూ ప్రశ్నించాడు. అయితే విశాఖలో ఏ ప్రాంతంలో జరిగిందో తెలియదు కానీ.. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్కన ఉన్నవారు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు అది విపరీతంగా ట్రోల్ అవుతోంది.
పోలీసుల కఠిన ఆంక్షలు
ఇటీవల విశాఖ నగరంలో ట్రాఫిక్ విషయంలో పోలీసులు( police) కఠినంగానే వ్యవహరిస్తున్నారు. దాదాపు గ్రేటర్ లో 12 లక్షల వరకు వాహనాలు ఉన్నాయి. అయితే నగరంలో హెల్మెట్ లేకుండా బండి నడిపే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు 53 వేల మందికి పైగా ద్విచక్ర వాహనదారుల లైసెన్సులు రద్దయ్యాయి. హెల్మెట్ లేకుండా నగరంలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య రోజుకు ఎక్కువ అవుతోంది. అందుకే ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేసి హెల్మెట్ లేని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. లైసెన్సులు రద్దు చేయాలని రవాణా శాఖకు సిఫారసులు చేస్తున్నారు.
Also Read: వివేకా కుమార్తె సునీత ఎంట్రీ.. ఆందోళనలో వైసిపి
పెరిగిన జరిమానాలు
గతంలో బైక్ పై హెల్మెట్( helmet) లేకుంటే వంద రూపాయలు జరిమానా విధించేవారు. కానీ ఇప్పుడు వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో ఓ ఇంటి వద్ద బైక్ ను పార్క్ చేశాడు. అక్కడికి వచ్చిన ట్రాఫిక్ పోలీస్ జరిమానా కట్టాలని అడిగాడు. ఎందుకు కట్టాలి అని సదరు యువకుడు ప్రశ్నించాడు. ఇంటి ముందు పార్కింగ్ చేసుకుంటే.. ఫైన్ ఎలా విధిస్తారు అంటూ ప్రశ్నించాడు. ఎక్కడైనా చట్టంలో చెప్పారా? నిబంధనలు ప్రకటించారా? అంటూ నిలదీసినంత పని చేశాడు. అయితే విశాఖలో ఏ ప్రాంతంలో జరిగింది అనేది మాత్రం తెలియడం లేదు. ఇంటి ముందు పార్కింగ్ చేసినట్టు కనిపిస్తోంది. మరోవైపు అక్కడే ప్రధాన రహదారి కూడా ఉంది. దీంతో అది వ్యాపార సముదాయమా? ఇల్లా అనేది తెలియడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.