https://oktelugu.com/

R. Krishnaiah : అటు తిరిగి.. ఇటు తిరిగి.. చివరకు టిడిపికి దగ్గరగా ఆర్.కృష్ణయ్య

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర రాజకీయాలు నెలకొన్నాయి. ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేసే క్రమంలో జరుగుతున్న ప్రయత్నాలు నివ్వెర పరుస్తున్నాయి. ఏపీలో వైసిపి అధికారాన్ని కోల్పోయింది. కూటమి అధికారంలోకి వచ్చింది. కొంతమంది వైసీపీ నేతలు స్వచ్ఛందంగా పదవులు వదులుకోవడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : November 15, 2024 / 02:32 PM IST

    R. Krishnaiah

    Follow us on

    R. Krishnaiah :  బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య టిడిపికి దగ్గరవుతున్నారా?అదే ప్రయత్నాల్లో ఉన్నారా? లేకుంటే బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారా? తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కృష్ణయ్య ఇటీవలే పదవికి రాజీనామా చేశారు.ఆయన బిజెపిలో చేరతారని ప్రచారం కూడా జరిగింది. అయితే జాతీయస్థాయిలో బీసీ ఉద్యమ పార్టీని ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా తాను రాజీనామా చేసినట్లు కృష్ణయ్య చెప్పుకొచ్చారు. జాతీయస్థాయిలో బీసీ గణన జరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఆయన అడుగులు తెలుగుదేశం పార్టీ వైపు వేస్తున్నట్లు తెలుస్తోంది.2014లో రాష్ట్ర విభజన సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. బీసీ పార్టీగా టిడిపికి ముద్ర ఉంది. దానిని చెరిపేందుకు ఏకంగా కృష్ణయ్యను ఏపీకి రప్పించి రాజ్యసభ పదవి ఇచ్చారు జగన్. కానీ ఇప్పుడు వైసీపీ ఓడిపోయేసరికి రాజకీయాల్లో భాగంగానే కృష్ణయ్య రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వైసిపి లో బీసీ నేతలు చాలామంది ఉన్నా కృష్ణయ్యను పిలిచి మరి జగన్ పదవి ఇచ్చారు.ఇప్పుడు అదే కృష్ణయ్య పదవిని వదులుకొని జగన్ ను ఇరకాటంలో పడేశారు. అంతటితో ఆగకుండా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

    * బిజెపి గాలం వేసినట్లు ప్రచారం
    కృష్ణయ్యను బిజెపి గాలం వేసినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది.2028 ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా గెలవాలని బిజెపి బలమైన సంకల్పం పెట్టుకుంది. ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను దగ్గర చేసుకుంది. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువ. వారిని తమ వైపు తిప్పుకోవాలన్న ఆలోచనతో మందకృష్ణ మాదిగ కు బిజెపి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడు కృష్ణయ్య విషయంలో సైతం బిజెపి అదే వ్యూహంతో ఉన్నట్లు టాక్ నడిచింది. అయితే కృష్ణయ్య మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టిడిపిలో కుదరదు అనుకుంటే.. అదే టిడిపి నేతల ప్రోద్బలంతో బిజెపిలో చేరతారని విశ్లేషణలు ప్రారంభం అయ్యాయి.

    * చుట్టూ టిడిపి నేతలతో
    రాజ్యసభ పదవిని వదులుకున్న కృష్ణయ్య బీసీ ఉద్యమంపై పూర్తి దృష్టి పెట్టారు. అందులో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడు అయ్యారు. ఆ సంఘం ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వై నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఆయన టిడిపికి అనుకూలమైన వ్యక్తి. అదే సమయంలో టీడీ జనార్ధన్, బీద రవిచంద్ర, నూకసాని బాలాజీ వంటి వారు కృష్ణయ్య చుట్టూ చేరారు. ఆయనను ఘనంగా సత్కరించారు. దీంతో కృష్ణయ్య అటు తిరిగి ఇటు తిరిగి.. చివరకు తెలుగుదేశం పార్టీలో చేరతారా? అన్న అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.