Anchor Shiva Jyothi: నిజం బయలుదేరే లోగా.. అబద్ధం ఊరంతా చుట్టుముట్టి వచ్చేస్తుంది అంటారు. అటువంటి అబద్ధమే తాజాగా టీటీడీ ( Tirumala Tirupati Devasthanam) విషయంలో జరిగింది. శివ జ్యోతి అనే యాంకర్ విషయంలో టిటిడి ఆంక్షలు విధించిందని.. ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేసిందని.. ఆమెకు శాశ్వతంగా స్వామి వారి దర్శనం నిషేధించినట్లు ఒక వార్త బయటకు వచ్చింది. దానిపై పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. అది తప్పుడు వార్తగా ఖండించింది. అటువంటిది ఎన్నడూ చేయమని తేల్చి చెప్పింది. అటువంటి పరిస్థితి టీటీడీలో ఉండదని.. దేవుడు దర్శనాన్ని నిషేధించడం అనే మాట ఉండదని కూడా తేల్చి చెప్పింది టిటిడి. దీంతో యాంకర్ శివజ్యోతి విషయంలో జరిగిన ది ఫేక్ ప్రచారం అని తేలిపోయింది. తిరుమల దర్శనానికి సంబంధించిన క్యూ లైన్ లో ఉన్న శివ జ్యోతి స్వామి వారి ప్రసాదం పై వ్యాఖ్యానిస్తూ ఓ వీడియో చేశారు. గత రెండు రోజులుగా ఆ వీడియో సర్కిలేట్ కావడంతో టీటీడీ స్పందించినట్టుగా ప్రచారం సాగింది. అయితే దీనిపై శివ జ్యోతి మాట్లాడుతూ అది పాత వీడియోగా తేల్చేశారు.
* అదే పనిగా ప్రచారం..
ఇటీవల టీటీడీ విషయంలో చిన్న అంశాలు సైతం భూతద్దంలో పెట్టి చూపుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా లో( social media) యాక్టివ్ గా ఉన్నవారు ఇటువంటివి వాటికి ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. టీటీడీ విషయాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి కూడా. అప్పట్లో టిటిడి లడ్డు వివాదం, తాజాగా పరకామణి చోరీ కేసు వంటివి మరింత హైప్ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు టీటీడీ విషయంలో ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టు చూపుతున్నారు. యాంకర్ శివ జ్యోతి విషయంలో జరిగింది అదే. ఎప్పుడో ఆమె పాత వీడియోను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నారు. కొత్తగా తప్పు జరిగిందని.. టిటిడి కఠిన చర్యలకు ఉపక్రమించిందని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న వివాదాలు చాలావున్నట్టు కొత్త వివాదాలు కొంతమంది కావాలని సృష్టిస్తున్నారు.
* మరోసారి క్షమాపణ..
ప్రస్తుతం శివజ్యోతి( anchor sivajyoti ) ఏడు నెలల గర్భిణి. ఆమెకు సంబంధించిన వీడియో బయటకు రావడం.. టీటీడీ స్పందించినట్టు ప్రచారం జరుగుతుండడంతో ఆమె మనస్థాపానికి గురయ్యారు. మరోసారి వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు కోరారు. అది పాత వీడియో గా చెప్పుకొచ్చారు. ఇంకో వైపు టీటీడీ సైతం స్పందించింది. ఆమె ఆధార్ బ్లాక్ చేసామని చెప్పడంలో ఎంత మాత్రం నిజం లేదని తెలిసింది. అటువంటి హక్కు టీటీడీకి ఉండదని కూడా చెప్పింది. దేవుడి దర్శనానికి సంబంధించి నిషేధించే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేసింది. తద్వారా లేనిపోని వివాదాలు వద్దని.. దేవుడిపై అటువంటి వాటిని రుద్ద వద్దని కూడా విజ్ఞప్తి చేసింది. మొత్తానికి అయితే ఫేక్ కే ఎక్కువగా ప్రచారం దక్కుతుండడం విశేషం.