AP Liquor Scam: ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam ) సృష్టిస్తోంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందన్నది కూటమి ఆరోపణ. అయితే ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపితే కుంభకోణం ఎలా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. అయితే ఇప్పటికే ఈ కేసులో అప్పటి బేవరేజెస్ ఎండి వాసుదేవ రెడ్డి, అధికారి సత్య ప్రసాద్ అప్రూవర్ గా మారారని వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తించిన నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతోంది. అప్పట్లో మద్యం కుంభకోణంలో సునీల్ రెడ్డి కంపెనీల ద్వారా బ్లాక్ మనీని వైట్ గా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు మద్యం కుంభకోణం కొత్త మలుపుకు తిరిగినట్లు అయ్యింది. ఈ కొత్త అరెస్టుతో మరిన్ని సంచలన అంశాలు బయటపడే అవకాశం ఉంది.
* జగన్ చుట్టూ నేతల అరెస్ట్..
అయితే మద్యం కుంభకోణంలో అంతిమ లబ్దిదారుడు ఎవరన్నది తేలాల్సి ఉంది. ఇప్పటివరకు కీలక వ్యక్తులు అరెస్టయ్యారు ఈ కేసులో. తొలుత రాజ్ కసిరెడ్డి ( Raj Kasa Reddy )అరెస్టు జరగక తరువాత పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా అంతా జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు అరెస్టయ్యారు. అయితే మధ్యలో కొంతమందికి బెయిల్ లభించింది. అయితే అలా బెయిల్ లభించినట్లు చేసింది సిట్ అని ఊహాగానాలు వచ్చాయి. మరింత మందిని ఇరికించే భాగంలోనే వారికి బెయిల్ ఇచ్చారని తెలుస్తోంది. ఒకవైపు విచారణ, మరోవైపు అరెస్టులు, ఇంకోవైపు బెయిల్.. ఇలా ఈ కేసులో అనేక రకాల పరిణామాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్ జరగడం మాత్రం నిజంగా సంచలనమే.
* ఆ కంపెనీలకు కుంభకోణం సొమ్ము..
నర్రెడ్డి సునీల్ రెడ్డికి ( Sunil Reddy)విదేశాల్లో పెద్ద ఎత్తున కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఈ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు సీట్ గుర్తించింది. సునీల్ రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు అని కూడా తెలుస్తోంది. దీంతో సునీల్ రెడ్డి ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు సిట్ మరింత దూకుడుగా ముందుకు అడుగులు వేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్రూవర్ గా మారేందుకు అవకాశం ఉన్న వాసుదేవరెడ్డి తో పాటు సత్యప్రసాద్ బెయిల్లను రద్దు చేయాలని కోరడం ఈ కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు. మొత్తానికి అయితే మద్యం కుంభకోణంలో నాటికీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవి ఎంతవరకు తీసుకెళ్తాయో చూడాలి.