Koratala Siva: ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు గొప్ప విజయాలను అందుకున్నారు… సూపర్ సక్సెస్ లను సాధించినప్పుడు దర్శకులకు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటుందో, ఫ్లాప్ సినిమాలు తీసినప్పుడు అంతకు మించిన విమర్శలను మూటగట్టుకోవాల్సి ఉంటుంది…ఇక ఇలాంటి క్రమంలోనే కొరటాల శివ లాంటి దర్శకుడు కెరియర్ స్టార్టింగ్ లోనే వరుసగా నాలుగు విజయాలతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. మరి అలాంటి స్టార్ డైరెక్టర్ ఆ తర్వాత చిరంజీవితో చేసిన ‘ఆచార్య’ సినిమాతో బొక్క బోర్లా పడ్డాడు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక దాంతో కొరటాల శివ కెరియర్ డైలమాలో పడిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ ‘త్రిబుల్ ఆర్’ సినిమా తర్వాత దేవర సినిమా చేయడానికి కొరటాల శివ కి అవకాశం ఇచ్చాడు. కానీ కొరటాల దేవర సినిమాను చాలా బాగా తెరకెక్కించినప్పటికి ఫ్యాన్స్ విషయంలో కొంతవరకు డల్ అయిందనే చెప్పాలి. ఇక కమర్షియల్ విషయాల్లో కూడా పెద్దగా కలెక్షన్స్ ని వసూలు చేయలేకపోయింది. దాంతో జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలైపోయాయి. ఇక ఎలాగో దేవర పార్ట్ వన్ చివర్లో దేవర పార్ట్ 2 కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇక ‘దేవర 2’ కూడా చేసి పార్ట్ వన్ ను మించిన సక్సెస్ ని జూనియర్ ఎన్టీఆర్ కి అందించాలని కొరటాల శివ అనుకున్నప్పటికి ప్రస్తుతం ఆ సినిమా ఆగిపోయింది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అలాగే ఎన్టీఆర్ సైతం దేవర పార్ట్-2 మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక కొరటాల శివ సంవత్సరం నుంచి దేవర 2 సినిమా మీద వర్క్ చేస్తున్నప్పటికి ఇప్పుడు ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అవ్వడంతో తను నెక్స్ట్ ఏ హీరో తో సినిమా చేయబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. నిజానికి కొరటాల అడిగితే స్టార్ హీరోలు సైతం డేట్స్ ఇస్తారు.
కానీ ప్రస్తుతం స్టార్ హీరోలందరు బిజీగా ఉండడం వల్ల ఆయన మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. మరి అతను చిన్న హీరోతో సినిమా చేసి మరోసారి సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మీడియం రేంజ్ హీరోలైతేనే కొరటాల శివకు అందుబాటులో ఉంటారు.
ఇంకా స్టార్ హీరోల కోసం వెయిట్ చేయాలంటే మాత్రం మరో మూడు నాలుగు సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి స్టార్ హీరో రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టుకొని ఉన్నారు… మరి కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేయబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…