Balakrishna: నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనదైన రేంజ్ లో అభిమానులను సంపాదించి రెండు రంగాల్లో మంచి పేరు సంపాదించిన నటుడు బాలకృష్ణ. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అంచెలంచెలుగా ఎదిగారు బాలయ్య. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రాబోతున్న ఓ సినిమాలో బాలకృష్ణ నటించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుంటే మరోపక్క ఏపీలో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దీంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నందమూరి బాలకృష్ణ.
కదిరి నుంచి స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బస్సు యాత్రను ప్రారంభించారు. ఇక్కడికి ఎంతో మంది అభిమానులు ఆయన కోసం తరలి వచ్చారు. కొంతమంది వ్యక్తులు గుంపుగా వచ్చి సెల్ఫీ కోసం ఎగబడ్డారు. దీంతో బాలయ్య వెంటనే తన చేతికి పనిచెప్పారు. అంత మంది ఒకేసారి రావడంతో ఆగ్రహానికి గురైన బాలయ్య ఒక అభిమానిని మోచేతితో కొట్టారు. దీంతో అభిమానిని కొట్టిన బాలయ్య, కోపం ఎక్కువ అంటూ కామెంట్స్ రావడం ప్రారంభమయ్యాయి.
బాలయ్య సెల్ఫీల కోసం ఎగబడిన వారిని కొట్టడం ఇది కేవలం మొదటి సారి మాత్రం కాదు. అయితే ఎంత మంది అభిమానులు ఉన్నా బాలయ్యనే అదుపు చేయడానికి చూస్తారు. సెలబ్రెటీలు బయటకు వెళ్తే బౌన్సర్లను నియమించుకుంటారు. ఎవరైనా సెలబ్రెటీల వద్దకు వెళ్తే వారిని అదుపు చేస్తారు బౌన్సర్లు. కానీ బాలయ్య మాత్రం బౌన్సర్లను నియమించుకోలేదు. ఇంత ఫ్రీగా జనాలలోకి వస్తే సెల్ఫీ అంటూ ఇబ్బంది పడ్డట్టప్పుడు మాత్రమే బాలయ్య చేతికి పనిచెప్తారని అంటున్నారు అభిమానులు.
అభిమానులు దురుసుగా వ్యవహరిస్తే తాను మాత్రమే సరిచేయాలని తన అభిమానులపై వేరే ఎవరు కూడా దురుసుగా ప్రవర్తించడం, చేయి చేయడం ఇష్టం ఉండదు అంటారు బాలయ్య. అందుకే బౌన్సర్లను నియమించుకోలేదట. కానీ చాలా మంది ఈ విషయాన్ని మర్చిపోయి బాలయ్యను తిడుతుంటారు అని విమర్శలు చేస్తున్నారు అంటూ బాధ పడుతున్నారు బాలయ్య అభిమానులు.