https://oktelugu.com/

Balakrishna: సోదరికి బాలయ్య ఆత్మీయ ముద్దు

కేసరపల్లి సభా ప్రాంగణంలో లక్షలాదిమంది హర్షద్వానాల మధ్య చంద్రబాబు, పవన్, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎన్నెన్నో సుందర దృశ్యాలు కనిపించాయి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అయితే ఎమోషనల్ అయ్యారు. సోదరి భువనేశ్వరికి ఆత్మీయంగా ముద్దు పెట్టారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 12, 2024 / 12:54 PM IST

    Balakrishna

    Follow us on

    Balakrishna: ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. పలువురు రాజకీయ, సినీ సెలబ్రిటీలు తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం హాజరయ్యారు. అతిరథ మహారధులంతా తరలిరాగా.. కేసరపల్లి సభా ప్రాంగణంలో లక్షలాదిమంది హర్షద్వానాల మధ్య చంద్రబాబు, పవన్, ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎన్నెన్నో సుందర దృశ్యాలు కనిపించాయి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అయితే ఎమోషనల్ అయ్యారు. సోదరి భువనేశ్వరికి ఆత్మీయంగా ముద్దు పెట్టారు.

    ఈ ఎన్నికల్లో నారా భువనేశ్వరి ప్రచారం చేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో బయటకు వచ్చిన ఆమె ప్రజల్లోకి వెళ్లారు. చంద్రబాబు తరఫున బలంగా నిలబడ్డారు. అదే విషయాన్ని ఇటీవల ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో పవన్ ప్రకటించారు. అయితే భువనేశ్వరిని వైసీపీ నేతలు టార్గెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. శాసనసభలో చంద్రబాబుపై విరుచుకుపడే క్రమంలో వైసిపి నేతలు భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అభ్యంతరకర కామెంట్స్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. చంద్రబాబు కన్నీరుకు కారణమయ్యారు. అప్పుడే చంద్రబాబు శపధం చేశారు. ఇది గౌరవ సభ కాదని.. గౌరవ సభ అని.. అందుకే తాను ఈ సభలో ఉండనని.. మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిచి అడుగు పెడతానని శపధం చేశారు. గట్టిగానే పోరాటం చేసి కూటమిని అధికారంలోకి తీసుకు రాగలిగారు. ఇప్పుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసి శాసనసభలో అడుగుపెట్టనున్నారు.

    గత ఐదేళ్లుగా జరిగిన పరిణామాలు, తన సోదరి భువనేశ్వరికి జరిగిన అవమానాలు తలుచుకొని బాలకృష్ణ ఎమోషన్ అయ్యారు. అందుకే ప్రమాణ స్వీకార వేదికపై ఉన్న భువనేశ్వరి నుదుటిపై ఆత్మీయంగా ముద్దు పెట్టారు. కన్నీటి పర్యంతమవుతూ సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్విగ్న భరిత వాతావరణం ఏర్పడింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలే వైరల్ గా మారాయి.