Baba Ramdev AP Govt: వైయస్ జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy) రాజగురువుగా ఉండేవారు స్వామి స్వరూపానంద( Swami swarupananda ). విశాఖ శారదా పీఠం అప్పట్లో ఒక రాజకీయ కేంద్రంగా మారిపోయిందన్న విమర్శలు ఉండేవి. తరచూ జగన్మోహన్ రెడ్డి శారదా పీఠానికి రావడం.. స్వామివారిని దర్శించుకుని ఆయన దీవెనలు తీసుకోవడం వంటివి జరిగేవి. స్వరూపానందకు తిరుమలలో కూడా ఎనలేని ప్రాధాన్యం దక్కేది. అక్కడ పాలకవర్గాలకు మించి ఆయనకు ప్రయారిటీ ఇచ్చేవారు. ప్రత్యేక ప్రోటోకాల్ సైతం పాటించేవారు. తిరుమలలో శారదా పీఠానికి కొంత భూమి కూడా కేటాయించారు. కొన్ని భవనాలను కూడా ప్రత్యేకంగా స్వామివారి కోసం రిజర్వ్ చేశారు. అలాగే వేద విశ్వవిద్యాలయం ఏర్పాటుకు విశాఖ భీమిలిలో భూములు కూడా కేటాయించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శారదా పీఠానికి కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. తిరుమలలో కూడా స్వామివారి ప్రాధాన్యత తగ్గింది. ఏపీలో శారదా పీఠం కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయి. స్వామి స్వరూపానంద మీడియాకు కూడా పెద్దగా కనిపించడం లేదు.
Also Read: స్వేచ్ఛ కేసులో పూర్ణచంద్ర నాయక్ కు రిమాండ్.. పోలీసుల విచారణలో ఏం తేలనుంది?
* చాలా ఏళ్లుగా పీఠం
విశాఖ పెందుర్తిలో చాలా ఏళ్లుగా విశాఖ శారదా పీఠం( Sharada Preetham ) నడుస్తోంది. స్వామి స్వరూపానంద వద్దకు రాజకీయాలకు అతీతంగా నేతలు వెళ్లేవారు. ఆయన దీవెనలు తీసుకునేవారు. అయితే 2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చారు కెసిఆర్. ఆయనకు పూజలు, యాగాలంటే ప్రగాఢ నమ్మకం. దీంతో ఆయన స్వామి స్వరూపానందను ఆశ్రయించడం ప్రారంభించారు. స్వరూపానంద పర్యవేక్షణలో యజ్ఞాలు, యాగాలను తన స్వగృహంలో కేసీఆర్ నిర్వహించేవారు. ఆ క్రమంలో కెసిఆర్ చంద్రబాబుతో ఉన్న రాజకీయ విభేదాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి మరింత దగ్గరయ్యారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి సైతం స్వామి స్వరూపానంద రాజ గురువుగా మారిపోయారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో తరచు పెందుర్తి లోని శారదా పీఠానికి వచ్చేవారు. దీంతో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న విశాఖ పీఠానికి రాజకీయ తాకిడి పెరిగింది. అప్పటినుంచి స్వామి స్వరూపానంద మాట చెల్లుబాటు తెలుగు రాష్ట్రాల్లో పెరిగింది.
* తిరుమలలో సైతం ప్రయారిటీ.. తిరుమలలో( Tirumala) చాలా రకాల నిర్మాణాలను మార్చడం వెనుక స్వామి స్వరూపానంద సలహాలు ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మరోవైపు విశాఖలో శారదా పీఠానికి పెద్ద ఎత్తున భూములు కూడా కేటాయించింది నాటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. నామమాత్రపు ధరతో కేటాయింపులు చేశారు. భీమిలి సమీపంలో అత్యంత ఖరీదైన ఎనిమిది ఎకరాల విలువైన భూములను శారదా పీఠానికి కేటాయించారు. అక్కడ వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని శారదాపీఠం పెద్దలు నాడు చెప్పుకొచ్చారు. దీనిపై అప్పట్లో టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. శారదా పీఠానికి భూములు కేటాయించడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయినా నాడు జగన్మోహన్ రెడ్డి సర్కారు వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో తిరుమలలో సైతం స్వరూపానంద పరపతి పెరిగింది. ఆయనకు ఎనలేని ప్రాధాన్యం దక్కేది. కానీ ఇప్పుడు టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో సీన్ రివర్స్ అయ్యింది. ఆ భూములన్ని వెనక్కి తీసుకోవడంతో శారదా పీఠానికి షాక్ ఇచ్చినట్లు అయింది. ప్రస్తుతం స్వామీజీ హిమాలయాల వైపు వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
* రాందేవ్ బాబాకు ప్రాధాన్యం..
మరోవైపు ఏపీలో స్వామి స్వరూపానంద ప్లేసును యోగా బాబా రాందేవ్ ( Baba Ramdev)భర్తీ చేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. యోగ బాబాగా, ఆయుర్వేద ఉత్పత్తుల బ్రాండ్ అంబాసిడర్ గా బాబా రాందేవ్ కు మంచి పేరు ఉంది. గతంలో టిడిపి హయాంలో బాబా రాందేవ్ కు చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో 120 ఎకరాల భూములను ఆయుర్వేద కంపెనీ ఏర్పాటుకు కేటాయించినట్లు తెలుస్తోంది. మరోవైపు విశాఖ శారదా పీఠానికి భీమిలిలో కేటాయించిన 8 ఎకరాల భూమిని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ భూమిని సైతం బాబా రాందేవ్ కు కేటాయిస్తారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే స్వామి స్వరూపానంద స్థానంలో బాబా రాందేవ్ వచ్చారన్నమాట.