
రోడ్డుపై నడుస్తున్న యువతిని ఆకతాయి అటకాయించి బైక్ ఎక్కాలని కోరాడు. కాసేపు రిక్వెస్ట్ చేశాడు. దానికి ఆ యువతి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన అతడు కత్తితో దాడి చేసి హత్య చేసన సంఘటన సంచలనం సృష్టించింది. అందరు చూస్తుండగానే రాక్షసుడిగా మారిన యువకుడు విరచుకుపడ్డాడు. తీవ్ర ఆవేశంతో యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. కత్తితో విచక్షణా రహితంగా రెచ్చిపోయాడు. అందరు చూస్తుండగానే హత్య చేశాడు.
ఆంద్రప్రదేశ్ లోని గుంటూరు నగరం కాకాణి రోడ్డులో ఈ దారుణానికి వేదికైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థిని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. శనివారం కాకాణి వీధిలో నడుచుకుంటూ వెళుతోంది. అదే సమయంలో అటు వైపు వచ్చిన ఓ సైకో లాంటి యువకుడు విద్యార్థినిని తన బైక్ ఎక్కాలని కోరాడు. కావాల్సిన చోటుకు డ్రాప్ చేస్తానని మాట కలిపాడు.
ఆమె అందుకు నిరాకరించింది. దీంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో విద్యార్థిని మెడ, పొట్ట భాగంలో పొడిచాడు. తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆ యువతిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థిని మృతదేహాన్ని అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పరిశీలించారు. కేసు నమోదు చేయాల్సిందిగా పాత గుంటూరు పోలీసులను ఆదేశించారు.
దాడిలో ఆరు కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హతురాలి ఫోన్ లాక్ ఓపెన్ చేస్తే హత్య కేసులో కీలక సమాచారం లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే హత్యకు కారణాలు మాత్రం తెలియరాలేదు. నిందితుడు పరిచయస్తుడా అపరిచితుడా అనే విషయాలు తెలియాల్సి ఉంది. యువకుడి గురించి ఆరా తీస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అలాంటి వ్యక్తిని చూడలేదని స్థానికులు తెలిపారు.