Ayyannapatrudu: రాజకీయ నాయకులు నిత్యం ప్రజా జీవితంలో ఉంటారు. అలాంటప్పుడు వారు మాట్లాడే ప్రతి మాట ప్రభావవంతంగా ఉంటుంది. అందువల్ల రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తున్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.. మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్త పడాలి.
జనాలను ప్రభావితం చేసే అంశాలలో రాజకీయ నాయకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలా కాకుండా మైక్ ఉందని.. మాట్లాడే స్వేచ్ఛ ఉందని.. ఏదైనా మాట్లాడొచ్చని అనుకుంటే మాత్రం.. ఆ తర్వాత జరిగే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి.. ప్రస్తుతం ఏపీ శాసనసభ స్పీకర్ పై పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం ఏపీ శాసనసభకు అధిపతిగా కొనసాగుతున్నారు. విలక్షణమైన రాజకీయ నాయకుడిగా ఆయన పేరు పొందారు. పైగా ఆయన ప్రత్యర్థి పార్టీ మీద విమర్శలు చేయడంలో తనకు తానే సాటి అని అనేక సందర్భాల్లో నిరూపించుకున్నారు.. ఇప్పటికి కూడా జగన్ పార్టీ మీద ఆయన చేసే విమర్శలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన చేసిన విమర్శలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వీడియోల రూపంలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ముఖ్యంగా శాసనసభను అయ్యన్నపాత్రుడు నడిపించే విధానం ఇప్పటికే ప్రశంసలు అందుకుంది.
అయ్యన్నపాత్రుడు విశాఖ పట్నం నగరంలోని జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.. విశాఖపట్నం గురించి.. ఈ నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి ఆయన చెబితే బాగుండేది.. కానీ ఆయన ఆ విషయాలను ప్రస్తావిస్తూ..ఓ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అధి కాస్త వివాదమైంది. ఏపీలో పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి విశేషమైన అంశాలు ఉన్నాయి. అయితే ఈ విషయాలను ప్రస్తావిస్తూనే అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు..
“రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందాలి. తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది గోవా వెళ్తున్నారు. విశాఖలో టూరిజం డెవలప్ అవ్వాలని అందరికీ ఉంది. కానీ ఇక్కడ నిబంధనల వల్ల అది సాధ్యం కావడం లేదు. బీచ్ లో టీ తాగడానికి ఎక్కడి నుంచి వస్తారా? భర్త రెండు పెగ్గులు వేసి.. భార్య ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేయాలి” అంటూ అయ్యన్న వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి అయ్యన్న ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల వైసీపీకి అనుకోని ఆయుధం లభించినట్టు అయింది. విశాఖలో టూరిజం డెవలప్ కావడం లేదని.. దానికి ప్రభుత్వం నిబంధనలు అడ్డుగా ఉన్నాయని.. ఈ విషయాన్ని స్వయంగా స్పీకర్ చెబుతున్నారని.. విశాఖపట్నం అభివృద్ధి గురించి చెబుతున్న కూటమి.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
స్పీకర్ స్థాయిలో ఉంటూ.. భార్యాభర్తల పై దారుణమైన మాటలు.. #TheAndhraVoice #AndhraPradesh#AyannaPatrudu#CBNSadistRule pic.twitter.com/pgr0YSsPVk
— THE ANDHRA VOICE (@TheAndhraVoice) November 15, 2025