https://oktelugu.com/

Ayyannapatrudu: టిడిపి సీనియర్ పొలిటికల్ రిటైర్మెంట్!

టిడిపి ఆవిర్భావం నుంచి చాలామంది నేతలు కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పటి రాజకీయ పరిస్థితులు, వయోభారం తదితర కారణాలతో తప్పుకుంటున్నారు. తాజాగా ఓ సీనియర్ నేత రిటైర్మెంట్ ప్రకటన చేశారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 3, 2024 / 09:41 AM IST

    Ayyannapatrudu

    Follow us on

    Ayyannapatrudu: తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఒక్కొక్కరు పక్కకు తప్పుకుంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న వారు ఈ ఎన్నికల్లో చాలామంది తప్పుకున్నారు. తమ వారసులకు ఛాన్స్ ఇచ్చారు. పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, గౌతు శివాజీ, టీజీ వెంకటేష్, జెసి దివాకర్ రెడ్డి.. ఇలా చాలామంది పక్కకు తప్పుకున్నారు. వయోభారంతో ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కానీ తెర వెనుక మాత్రం రాజకీయాలు చేస్తున్నారు. అయితే తాజాగా టిడిపిలో ఒక బిగ్ షాట్ తన రాజకీయ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు ఇక చాలు అని ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు చెప్పేశారు. 2029 ఎన్నికల్లో తాను పోటీ చేయనని తేల్చి చెప్పేశారు. దీంతో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఆయన ఎవరో కాదు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు. గత కొంతకాలంగా ఆయన కుమారుడు విజయ్ పాత్రుడు పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నారు. దీంతో కుమారుడికి లైన్ క్లియర్ చేసేందుకేనని తెలుస్తోంది. అయితే అయ్యన్నపాత్రుడు పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటన ఇప్పటిది కాదు. 2019 ఎన్నికల్లోనే తాను పోటీ చేయనని.. కుమారుడికి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. కానీ ఆ ఎన్నికలు కీలకము కావడంతో చంద్రబాబు ఒప్పించడంతో పోటీ చేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో సైతం తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరారు. కానీ చంద్రబాబు ఒప్పుకోకపోయేసరికి పోటీ చేశారు. భారీ మెజారిటీతో గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కలేదు. రాజ్యాంగబద్ధ పదవి అయిన స్పీకర్ పదవిని దక్కించుకున్నారు. అప్పటినుంచి హుందాగా నడుచుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఎటువంటి వ్యాఖ్యానాలు చేయడం లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని అయ్యన్నపాత్రుడు ప్రకటించడం విశేషం.

    * నర్సీపట్నం ఎమ్మెల్యేగా
    తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు అయ్యన్నపాత్రుడు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు అయ్యన్నపాత్రుడు. సుదీర్ఘకాలం నర్సీపట్నం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. 1996లో అనకాపల్లి నుంచి టిడిపి ఎంపీగా గెలిచారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అయ్యన్న మంత్రి అయ్యారు. ఈసారి కూడా చంద్రబాబు సర్కార్లో మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ అనూహ్యంగా స్పీకర్ పదవి దక్కింది.

    * కుమారుడి కోసమే
    నర్సీపట్నం నుంచి తన కుమారుడు విజయ్ పాత్రుడిని పోటీ చేయించాలని ఆలోచనతో ఉన్నారు అయ్యన్న. గత కొంతకాలంగా విజయ్ మంచి సేవలు అందిస్తున్నారు. తండ్రి వలె దూకుడు కలిగిన నేత కూడా. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగానికి సేవలందించారు విజయ్. మంత్రి లోకేష్ కు అత్యంత సన్నిహితుడు కూడా. భవిష్యత్తులో లోకేష్ టీమ్ లో విజయ్ ఒకరుగా ప్రచారం జరుగుతోంది. కుమారుడికి లైన్ క్లియర్ చేసేందుకే అయ్యన్నపాత్రుడు రిటైర్మెంట్ ప్రకటన చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే వచ్చే ఎన్నికల నాటికి టిడిపిలో ఒక సీనియర్ క్రియాశీలక రాజకీయాలకు దూరమైనట్టే.