Nellore Politics: నెల్లూరు పై ఆత్మ సాక్షి సర్వే.. గెలుపు ఎవరిదంటే?

తాజాగా ఆత్మసాక్షి సర్వే జిల్లాల వారీగా తన ఫలితాలను వెల్లడిస్తోంది. నెల్లూరు జిల్లా ఫలితాలను తాజాగా వెల్లడించింది. ఇక్కడ పది నియోజకవర్గాలకు గాను వైసిపి ఆరు చోట్ల, టిడిపి నాలుగు చోట్ల గెలుపొందుతుందని సర్వే తేల్చింది.

Written By: Dharma, Updated On : February 6, 2024 3:16 pm

Nellore Politics

Follow us on

Nellore Politics: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ ప్రకటన రానుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.ఒ కవైపు ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తూనే.. అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి. ఏపీ సీఎం జగన్ ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. ఇప్పటివరకు 69 మంది సిట్టింగ్లను మార్చుతూ జాబితాలను ప్రకటించారు. త్వరలో మరో రెండు జాబితాలను విడుదల చేయనున్నారు. అటు టిడిపి, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైంది. ఒకటి రెండు రోజుల్లో కొలిక్కి రానుంది. త్వరలో ఇరు పార్టీల అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నారు. అయితే ఇంతలో సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. నేషనల్ మీడియాతో పాటు ఏజెన్సీలు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నాయి. వాటి ఫలితాలను వెల్లడిస్తున్నాయి.

తాజాగా ఆత్మసాక్షి సర్వే జిల్లాల వారీగా తన ఫలితాలను వెల్లడిస్తోంది. నెల్లూరు జిల్లా ఫలితాలను తాజాగా వెల్లడించింది. ఇక్కడ పది నియోజకవర్గాలకు గాను వైసిపి ఆరు చోట్ల, టిడిపి నాలుగు చోట్ల గెలుపొందుతుందని సర్వే తేల్చింది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసిపి ఏకపక్ష విజయాన్ని దక్కించుకుంది. పదికి పది స్థానాలను దక్కించుకుని స్వీప్ చేసింది. టిడిపి ఒక్క నియోజకవర్గంలో కూడా గెలుపొందలేదు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం వైసిపి ఆధిపత్యానికి గండి పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టిడిపిలో చేరారు. అటు వైసీపీలో సైతం విభేదాలు కొనసాగుతున్నాయి.దీంతో ఇక్కడ వైసీపీకి దెబ్బ తప్పదన్న విశ్లేషణలు ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆత్మసాక్షి సర్వే ఫలితాలు..తెలుగుదేశం -జనసేన కూటమి, వైసిపి మధ్య హోరాహోరీ ఫైట్ ఉంటుందని తేల్చింది.

టిడిపి, జనసేన కూటమికి సంబంధించి నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలు గెలుపొందుతుందని సర్వే తేల్చింది. ఇక సర్వేపల్లి, కొవ్వూరు, సూళ్లూరుపేట, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాలను వైసిపి కైవసం చేస్తుందని సర్వే స్పష్టం చేసింది. అయితే గతంలో ఆత్మ సాక్షి సంస్థ ఉత్పరాధితో పాటు తెలంగాణలో సైతం సర్వే ఫలితాలను వెల్లడించింది. కానీ అక్కడ వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. సర్వే పెద్దగా ఫలించలేదు. ఇప్పుడు ఏపీలో సైతం ఫలిస్తుందా? లేదా? అన్నది చూడాలి.