Cyclone Asani: శాస్త్ర సాంకేతిక ఎంతగా పెరుగుతున్నా సరైన సమాచారం మాత్రం అందడం లేదు. అసని తుఫాను విషయంలో వాతావరణ శాఖ వెల్లడించినట్లు కాకుండా అది దిశ మార్చుకుంటూ ఉభయ గోదావరి జిల్లాలను అతలాకుతలం చేసింది. తుఫాను ముప్పును అంచనా వేయడంలో సాంకేతిక గతి తప్పుతోంది. ఫలితంగా ముప్పును ముందే ఊహించడం లేదు. ఫలితంగా తుఫాను ధాటికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అసని తుఫానుతో ఏర్పడే ప్రమాదాన్ని ప్రజలకు తెలియజెప్పడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ క్రమంలో తుఫాను దిశ మార్చుకుని పెద్ద ప్రమాదాన్ని కొనితెచ్చింది.

ఈ తుఫానుకు శ్రీలంక అసని అని పేరు పెట్టింది. మొదటి ఒడిశాకు ముప్పు ఉందని చెప్పిన అధికారులు తరువాత ఉత్తరాంధ్రకు ఇబ్బంది వస్తుందని తేల్చారు. కానీ అది గోదావరి జిల్లాలను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోయింది. ఫలితంగా తీవ్ర నష్టం సంభవించింది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తుఫాను బీభత్సం సృష్టించింది. బాపట్లను కూడా వణికించింది. దీంతో వాతావారణ శాఖ అధికారులు అంచనాలు తలకిందులయ్యాయి.
Also Read: Sarkaru Vaari Paata First Full Review: ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ
అసని క్రమంగా బలహీనపడి తుఫానుగా విపత్తు నిర్వహణ సంస్థ చెప్పింది. గడచిన ఆరు గంటల్లో 12 కిలోమీటర్ల వేగంతో తుాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని చెబుతున్నారు. ఇప్పుడు మచిలీపట్నంకు 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలుస్తోంది. సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రయాణిస్తుంది.

అసని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర వణికిపోతోంది. వాతావరణ సూచనల విషయంలో అధికారులు సూచించిన ఏది కూడా నిజం కాలేదు. దీంతో అధికారుల తీరుతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ముప్పు ఎలా ఏర్పడుతుందని మాత్రం తెలియడం లేదు. అసని వల్ల ఇంకా ఏ ప్రాంతాలు ప్రమాదంలో ఇరుక్కుంటాయో అంతుచిక్కడం లేదు.
Also Read:Kotia Conflict: కొఠియా నీదా…నాదా సై.. దశాబ్దాలుగా వీడని వివాదం