AP political developments: ఏపీలో( Andhra Pradesh) జరుగుతున్న పరిణామాల వెనుక ఒక వ్యూహం ఉందా? కుట్ర కోణం దాగి ఉందా? రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతం? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఉన్నఫలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఓ మాజీ మంత్రి బూతు వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతుంది. మాజీ మంత్రులు వ్యూహాత్మకంగా ముందుకు వచ్చి వరుసగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు.. పరిస్థితి చేయి దాటినట్టు కనిపిస్తోంది. అరెస్టుల పర్వం నడుస్తోంది. పాలనపై ప్రభావం చూపుతుండగా.. జాతీయస్థాయిలో రాష్ట్ర పరిస్థితి చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్న వేళ ఇక్కడ రాజకీయ గందరగోళ పరిస్థితులు చూస్తుంటే మాత్రం.. ఏదో కుట్ర కోణం అన్నట్టు అనుమానాలు ఉన్నాయి.
కూటమిపై సంతృప్తి ఉండడంతో..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఊపందుకుంది అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇంకోవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఉద్యోగ ఉపాధి కల్పన జరుగుతోంది. సంక్షేమ పథకాలు సైతం అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై మాత్రం సంతృప్తి శాతం ఎక్కువ. అయితే ఇటీవల ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఒక విధంగా టిడిపి కూటమి ప్రభుత్వానికి ఇది ప్లస్ గా మారింది. రాజకీయంగా ఎదగాలని భావిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారింది. 2014 నుంచి 2019 మధ్య పారిశ్రామిక పెట్టుబడులు, అమరావతికి రుణాలు వంటి వాటిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసిందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అటువంటి విమర్శలు వచ్చాయి. అయినా తట్టుకొని ముందుకు వెళ్తోంది కూటమి ప్రభుత్వం. కానీ ఇప్పుడు శాంతి భద్రతల అంశం తెరపైకి వచ్చేలా పరిణామాలు జరుగుతున్నాయి. ఇవి ఉద్దేశపూర్వకంగా తలపెట్టిన వే అన్న అనుమానాలు ఉన్నాయి.
గతంలో లేని విధంగా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో( combined Andhra Pradesh) ఇటువంటి రాజకీయ దాడులు, ప్రతీకార కేసులు, అరెస్టులు జరిగేవి కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత మాత్రమే ఇటువంటి రాజకీయాలు మొదలయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెట్టింపు అయ్యాయి. అప్పట్లో టిడిపి కేంద్ర కార్యాలయం పైనే దాడి జరిగింది. కానీ ఇప్పుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం ఉద్దేశపూర్వకంగా చేశారా అని అనుమానం కూడా ఉంది. మరో మాజీ మంత్రి జోగి రమేష్ సైతం లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒకసారి రెండుసార్లు చేస్తే పర్వాలేదు. అదే పనిగా చేస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో అపఖ్యాతి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇటువంటి సమయంలో గందరగోళం క్రియేట్ చేసేందుకు వైసిపి ప్రయత్నిస్తోందన్న అనుమానాలు కూటమి నుంచి వినిపిస్తున్నాయి. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందడుగు వేయాల్సిన అవసరం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పై ఉంది. మరి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.