Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: లోకేష్ అంటేనే టిడిపి నేతలు మండిపడుతున్నారా?

Nara Lokesh: లోకేష్ అంటేనే టిడిపి నేతలు మండిపడుతున్నారా?

Nara Lokesh: ఇటీవల లోకేష్ బయటకు కనిపించడం మానేశారు. పార్టీ అంతర్గత కార్యక్రమాలకు పరిమితం అవుతున్నారు. పొత్తుల వ్యవహారం, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక వంటి వాటిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. దీంతో బయట రాజకీయ కార్యకలాపాలు తగ్గించారు. ఇదే అదునుగా వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయింది. లోకేష్ ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారని.. అక్కడ నిధుల సమీకరణలో భాగంగా హవాలా నేరానికి పాల్పడ్డారని లేనిపోని ప్రచారం చేశారు. కానీ ఆ ప్రచారంలో నిజం లేదని తేలింది.

అయితే ఇప్పుడు లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలకు శ్రీకారం చుట్టారు. శంఖారావం పేరిట సభలు నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి శ్రీకారం చుట్టనున్నారు. విశాఖ తో పాదయాత్ర నిలిచిపోవడంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో సమర శంఖం సభలు జరగనున్నాయి. పాదయాత్రలో కవర్ కానీ నియోజకవర్గాలకు ప్రాధాన్యమిస్తూ లోకేష్ సభలు కొనసాగిన ఉన్నాయి. అయితే ఈ సభలు ఎంతవరకు సక్సెస్ అవుతాయా? అన్నది అనుమానంగా ఉంది. టిడిపి శ్రేణులు మునుపటిలా యాక్టివ్ గా ఉంటాయా? అన్న ప్రశ్న ఎదురవుతోంది.

జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ సైతం పూర్తి అయినట్లు సమాచారం. సీట్లపై రకరకాల ఊహాగానాలు వస్తున్నా.. అటు చంద్రబాబు, ఇటు పవన్ నోరు మెదపడం లేదు. ఇంతలో బిజెపి సైతం కూటమిలోకి వస్తుందన్న సంకేతాలు వస్తున్నాయి. బిజెపి సైతం పెద్ద మొత్తంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు అడుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనన్న ఆందోళన టిడిపి నేతలను వెంటాడుతోంది. గత ఐదు సంవత్సరాలుగా పార్టీ కోసం ఎంతో మంది నేతలు పని చేశారు. ఇన్చార్జిలుగా ఉంటూ చేతి చమురు వదిలించుకున్నారు. ఇప్పుడు కానీ టికెట్లు దక్కకపోతే నష్టపోతామని భావిస్తున్నారు. అందుకే లో లోపల భయపడుతున్నారు.

మరోవైపు టికెట్లు విషయంలో క్లారిటీ ఇవ్వకుండా పార్టీ అధినేతలు పర్యటిస్తుండడంతో నియోజకవర్గ ఇన్చార్జిలు ఇబ్బంది పడుతున్నారు. అయితే తాజాగా లోకేష్ శంఖారావసభలు నిర్వహణకు కొంతమంది నేతలు ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ అనుకూల మీడియా ఇప్పుడు లోకేష్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. లోకేష్ వల్ల ప్లస్ కంటే మైనస్ అధికమని టిడిపి శ్రేణులు భావిస్తున్నట్లు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దుష్ప్రచారం చేస్తోంది. దీనిపై టిడిపి శ్రేణులు సైతం కౌంటర్ అటాక్ ఇస్తున్నాయి. ఈనెల 11న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంఖారావసభ ప్రారంభం కానుంది. ముందుగా ఉత్తరాంధ్రలో పూర్తిచేసి.. మిగతా జిల్లాల్లో అడుగు పెట్టాలని లోకేష్ భావిస్తున్నారు. కానీ లోకేష్ సభలకు సొంత పార్టీ నేతలు ఆసక్తి చూపడం లేదని వైసిపి ప్రచారం చేస్తోంది. దీనిని లోకేష్ ఎలా అధిగమిస్తారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular