APPSC Group 1 Mains Exam: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీపీఎస్సీ ( APPSC )గ్రూప్ 1 మెయిన్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. మే 3 నుంచి 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం ఏడు రోజుల్లో ఏడు పరీక్షలు జరుగుతాయి. గ్రూప్ 1 పరీక్షలు పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలోనే ఉండనున్నాయి. గత కొంతకాలంగా మెయిన్స్ పరీక్షల కోసం అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 2024 మార్చి 17న ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ లో ఫలితాలు వెల్లడయ్యాయి. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 4496 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు. అదిగో ఇదిగో మెయిన్స్ అంటూ ప్రకటనలు వచ్చాయి. ఎట్టకేలకు షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సమయం ఉండడంతో అహోరాత్రులు శ్రమించేందుకు సిద్ధమవుతున్నారు.
* వారం రోజులు పాటు పరీక్షలు
గ్రూప్ 1( group 1 ) మెయిన్స్ కు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది ఏపీపీఎస్సీ. మే 3 నుంచి 9 వరకు వారం రోజుల వ్యవధిలో ఏడు పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుంది. యాప్ ద్వారా ప్రశ్నాపత్రాలు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అభ్యర్థులకు ఆప్షన్ ఇచ్చారు. సమీప జిల్లాల వారు ఆ కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. వేసవిలో ఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతుండడంతో యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
* అభ్యర్థుల ఎదురుచూపు
గ్రూప్ 1 మెయిన్స్( group 1 mains ) పరీక్షల కోసం గత పది నెలలుగా అభ్యర్థులు ఎదురుచూస్తూ వచ్చారు. వాస్తవానికి 2023 డిసెంబర్లో 89 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ జారీ అయ్యింది. కానీ నియామక ప్రక్రియ పూర్తి చేయడంలో వైసీపీ సర్కార్ విఫలమైంది. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతూ వచ్చింది. గత ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం.. కొత్త ప్రభుత్వం జూన్ నెలలో కొలువు తీరడం వంటి కారణాలతో జాప్యం జరిగింది. తాజాగా కూటమి ప్రభుత్వం దీనిపై ఫోకస్ పెట్టింది. వీలైనంత త్వరగా రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని భావించింది. అందుకే ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది.
– షెడ్యూల్ ఇలా..
* మే 3న తెలుగు పేపర్ అర్హత పరీక్ష
* మే నాలుగు నా ఇంగ్లీష్ పేపర్ అర్హత పరీక్ష
* మే 5న పేపర్ 1 జనరల్ ఎస్సే పరీక్ష
* మే 6 న పేపర్ 2 భారతదేశం, ఏపీ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు
* మే 7న పేపర్ 3 పాలిటిక్స్, రాజ్యాంగం, పాలన, లా అండ్ ఎథిక్స్
* మే 8న పేపర్ 4 భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
* మే 9న పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం.