AP women Free Buss: ఏపీలో( Andhra Pradesh) మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం కానుంది. ఈనెల 15 నుంచి పథకం ప్రారంభించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు రాష్ట్ర మంత్రివర్గం సైతం ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం అమలుకు సంబంధించి విధివిధానాలను కూడా ఆమోదించింది ఏపీ క్యాబినెట్. మొత్తం ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ ప్రభుత్వం అనుమతించింది. అయితే పొరపాటున కొన్ని బస్సులు ఎక్కితే మాత్రం మహిళలకు ఇబ్బందులు తప్పవు. తప్పకుండా టికెట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత ప్రయాణాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే స్పష్టమైన మార్గదర్శకాలు జారీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అధికారంలోకి వస్తే ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలు చేస్తున్నారు.
Read Also: కమ్ముకొస్తున్న మేఘాలు.. ఏపీకి భారీ హెచ్చరిక
ఐదు రకాల బస్సుల్లో ఉచితం..
ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే మహిళల ఉచిత ప్రయాణానికి( free travelling) సంబంధించి పథకానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టారు. మొత్తం ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం కల్పించనున్నారు. మహిళలు ఆధార్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డు ఐడిలో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, నగరాల్లో మెట్రో, సిటీ సబర్బన్ సర్వీసులు ఉంటాయి. వీటిలో మాత్రమే ఎక్కడినుంచి ఎక్కడికి అయినా ఉచితంగా ప్రయాణించవచ్చు. అదే సమయంలో ప్రీమియర్ సర్వీసులుగా ఉన్న నాన్ స్టాప్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, తిరుమల ఘాట్ రోడ్డులో వెళ్లే బస్సులకు ఉచిత ప్రయాణ పథకం వర్తించదు. పొరపాటున ఈ బస్సుల్లో ఎక్కితే టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే మహిళలు ఒకటికి రెండుసార్లు చూసుకుని బస్సులు ఎక్కాల్సి ఉంటుంది.
Read Also: షర్మిలకు షాక్.. వర్కింగ్ ప్రెసిడెంట్లు గా ఆ ఇద్దరు!
ఉచిత బస్సుల్లో సైతం టిక్కెట్లు..
అయితే ఉచిత ప్రయాణ పథకంలో సైతం.. బస్సు ఎక్కిన మహిళలకు టికెట్లు ఇస్తారు. అయితే వాటిని జీరో ఫెర్ గా( zero fair) చూపిస్తారు. టికెట్ ధర జీరో గా చూపిస్తారు. వారు ప్రయాణించే స్టేషన్ల మధ్య టిక్కెట్ ధరను సైతం అందులో పొందుపరుస్తారు. అలా టికెట్ ధరను ప్రభుత్వ రాయితీ కింద చూపించనున్నారు. మరోవైపు ఉచిత ప్రయాణానికి సంబంధించి ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ కూడా ఇస్తున్నారు. అనవసర వివాదాలు లేకుండా.. మహిళల పట్ల మర్యాదగా వ్యవహరించే విధంగా సిబ్బందికి పలు రకాల సూచనలు ఇస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. మిగతా రాష్ట్రాల్లో ఈ పథకం అమలు జరుగుతుండగా అనేక రకాల వివాదాలు జరుగుతున్నాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది.