AP TET 2025 Notification: ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి కీలక అప్డేట్. ఏపీలో టెట్ 2025 నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది. డిసెంబర్ 10న పరీక్ష జరగనుంది. జనవరి 19న ఫలితాలు వెలువడనున్నాయి. దరఖాస్తుల ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. నవంబర్ 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులు కూడా రాయాల్సిందే. పేపర్ టుడే అర్హత మార్కులను 50%, 45 శాతానికి పెంచారు. మొన్ననే ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. ఇకనుంచి ఏటా డీఎస్సీ నియామక ప్రక్రియ ఉంటుందని మంత్రి లోకేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు నోటిఫికేషన్ రావడంతో తప్పకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
* ఆన్లైన్ విధానంలో
ఈసారి టెట్ ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షల నోటిఫికేషన్, సమాచార బులెటిన్, పరీక్షల షెడ్యూల్, సిలబస్, అభ్యర్థులకు సూచనలు, విధి విధానాలను http://tet2dsc.apcfss.in వెబ్ సైట్ లో ఉంచినట్లు టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. సందేహాల నివృత్తికి 8121947387, 8125046997, 7995649286, 7995789286, 9963069286 నంబర్లను అందుబాటులో ఉంచారు.
* ఈరోజు నుంచి దరఖాస్తులు..
ఈరోజు నుంచి టెట్ ఫీజు చెల్లింపు తో పాటు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. నవంబర్ 23 వరకు అంటే నెలరోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. నవంబర్ 25న ఆన్లైన్ మాక్ టెస్ట్ నిర్వహిస్తారు. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 10న పరీక్ష ఉంటుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్… మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ లో పరీక్ష నిర్వహిస్తారు. 2026 జనవరి 2 న కీ విడుదల చేస్తారు. దానిపై అభ్యంతరాలను తొమ్మిదో తేదీ వరకు స్వీకరిస్తారు. తుది కీ జనవరి 13న, తుది ఫలితాలు జనవరి 19న విడుదల చేస్తారు. ఏపీ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ విద్యా హక్కు చట్టం ప్రకారం టెట్ నిర్వహణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులు కూడా టెట్ రాయడానికి అవకాశం కల్పించారు.