Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu Social Media Rules: ఏపీలో సోషల్ మీడియా నిషేధం!

CM Chandrababu Social Media Rules: ఏపీలో సోషల్ మీడియా నిషేధం!

CM Chandrababu Social Media Rules:  ఏపీ ప్రభుత్వం( AP government ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల సోషల్ మీడియా వాడకానికి సంబంధించి కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసింది. 13 సంవత్సరాల లోపు వారికి సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను మూడు నెలల్లో ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీంతో ఇది ఆసక్తికరంగా మారింది. గతంలో మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలో ఉండగా చిన్నపిల్లలకు సంబంధించి సోషల్ మీడియా నిషేధం విధిస్తామని సూత్రప్రాయంగా తెలిపారు. ఆ మధ్యన ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి నారా లోకేష్ వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ విద్యా విధానాలపై ఆయన అధ్యయనం చేశారు. 16 ఏళ్లలో వారికి సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించారు. ఇప్పుడు ఏపీలో సైతం 13 ఏళ్ల లోపు చిన్నారులకు సోషల్ మీడియా వాడకానికి సంబంధించి నిషేధం ప్రకటించడంతో.. వాటి విధివిధానాలపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2 ‘ కి బయ్యర్స్ కరువు.. కారణం ఏంటంటే!

* సీఎం ప్రత్యేక ప్రకటన..
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు( assembly sessions ) జరుగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా వాడకం నిషేధం పై సర్వత్రా చర్చ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ సోషల్ మీడియా నిషేధం అమలవుతోంది. ఎలాంటి విధానాలు అమలు చేశారు అన్నది హాట్ టాపిక్ అవుతోంది. అయితే పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించిన తొలి దేశం ఆస్ట్రేలియా. అక్కడ 16 సంవత్సరాలు లోపు వారికి సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించారు. ఫేస్బుక్, ఎక్స్, టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్ చాట్, త్రెడ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారం వాడకాన్ని 16 ఏళ్లలోపు వారికి నిషేధం.

* దుష్పరిణామాలు అధికం..
ఇటీవల సమాజంలో సోషల్ మీడియా( social media) వినియోగం గణనీయంగా పెరిగింది. అయితే సోషల్ మీడియాతో ఫలితాలు కంటే దుష్పరిణామాలే అధికం. సోషల్ మీడియా వినియోగం మాటున నేరాలు, అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పిల్లల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. అందుకే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. అయితే సోషల్ మీడియా నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా చిన్నారులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తే తల్లిదండ్రులపై చర్యలు తీసుకోరు. బదులుగా సోషల్ మీడియా సంస్థలకు జరిమానాలు విధిస్తుంటారు. అందుకే అక్కడ పక్కాగా సోషల్ మీడియా నిషేధం అమలు జరుగుతోంది.

* అమలుపై చర్చ..
అయితే ఏపీలో సోషల్ మీడియా నిషేధం అంటే శుభ పరిణామమే. అయితే ఎలా అమలు చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఎందుకంటే సోషల్ మీడియా నిషేధం అంటే చిన్న పని కాదు. పక్కాగా అమలు చేస్తేనే దీని ఫలితాలు ఉంటాయి. ఇప్పటికే ఆన్లైన్ విద్యా బోధన పేరిట స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్ టీవీల వినియోగం పెరిగింది విద్యాబోధనలో. ఇప్పుడు 13 సంవత్సరాల లోపు చిన్నారులకు సోషల్ మీడియా నిషేధం అంటే ఆన్లైన్ బోధనపై తప్పకుండా ప్రభావం చూపుతుంది. అయితే అధ్యయనానికి ఓ మూడు నెలల కాలం తీసుకోవడంతో.. 90 రోజుల తర్వాత నిషేధం ఎలా అమలు చేస్తారు అనేది సర్వత్ర చర్చనియాంశం అయింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular