AP Senior IPS Appointments 2025: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలపై దృష్టి సారించింది. తాజాగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది. వారికి వేర్వేరు విభాగాలకు శాఖాధిపతులుగా నియామకాలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఐపీఎస్ అధికారుల బదిలీలు సర్వసాధారణమే. కానీ ఓ ముగ్గురు అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించింది కూటమి ప్రభుత్వం. అయితే ఈ ముగ్గురు అధికారులు ప్రభుత్వానికి అనుకూలమన్న కామెంట్స్ ఉన్నాయి.
Also Read: టికెట్ ఇచ్చినా.. ఇవ్వకున్నా పోటీనే.. జనసేనకు బాలినేని ఝలక్
- సీనియర్ ఐపీఎస్ అధికారిగా మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు. డిజిపిగా ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ చివరి నిమిషంలో ఆయనకు డిజిపి పోస్ట్ చేజారింది. అయితే ఇప్పుడు రోడ్డు సేఫ్టీ అధారిటీ చైర్మన్ గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు.
- ఇక మరో ఐపిఎస్ అధికారి వెంకటరమణకు సైతం ఎలక బాధ్యతలు కట్టబెట్టారు. ఇప్పటివరకు డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ టెక్నికల్ కు పని చేస్తున్నారు వెంకటరమణ. ఇప్పుడు అదే విభాగానికి బిజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించారు.
- వెయిటింగ్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్ వి శ్రీధర్ రావుకు సైతం కీలక బాధ్యతలు అప్పగించారు. సిఐడి పోలీస్ సూపరింటెంట్ గా నియమించారు. చాలా రోజులుగా ఈ పోస్ట్ ఖాళీగా ఉండగా ఇప్పుడు భర్తీ చేశారు. తక్షణం ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.