Homeఆంధ్రప్రదేశ్‌AP Religious Controversy: ఏపీలో మత వివాదాలు.. ఆ పార్టీకే నష్టం!

AP Religious Controversy: ఏపీలో మత వివాదాలు.. ఆ పార్టీకే నష్టం!

AP Religious Controversy: ఏపీలో ప్రస్తుతం భిన్న వాతావరణం కనిపిస్తోంది. ప్రధానంగా మతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు బయటపడుతున్నాయి. ఓ పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే ఒక పాస్టర్ పై విశాఖ గ్రామీణ ప్రాంతంలో దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే తనకు తాను దాడి చేయించుకుని సానుభూతి డ్రామా ఆడినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే మతపరమైన అంశాలు ఏపీలో ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలన్న ఆలోచనతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అంతిమంగా ఓ పార్టీపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ తాజా పరిణామాల వెనుక ఆ పార్టీ ఉందన్న అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి. అది అంతిమంగా ఆ పార్టీకే నష్టం.

* కూటమి విడగొట్టేందుకు ప్రయత్నం
ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. టిడిపి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వంలో జనసేనతో పాటు బిజెపి ప్రధాన భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. అయితే ఆ మూడు పార్టీలు కలిసి ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. కూటమి విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. మరోవైపు మతపరమైన అంశాలు, దాడులు, కేసులు కూడా బయటపడుతున్నాయి. అయితే ఇదంతా ఉద్దేశపూర్వకం అని ఒక ప్రచారం ఉంది. అనుకూల విశ్లేషకులు, సోషల్ మీడియా ద్వారా ఏపీలో అస్థిరత సృష్టించేందుకు జరుగుతున్న కుట్రగా తెలుస్తోంది.

* మతపరమైన ముద్ర..
ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఒక పార్టీకే నష్టం. ఇప్పటికీ ఆ పార్టీపై మతపరమైన ముద్ర ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ ఇటువంటి వాటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది.. అయితే ఒక మత పరంగానే కాదు.. రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు కూడా పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ప్రస్తుతం కూటమి పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది. సంతృప్తి కనిపిస్తోంది. దానిని చెడగొట్టేందుకు చేసే ప్రయత్నాలు ఇట్టే తెలిసిపోతాయి. ఎందుకంటే గతంలోనూ ఆ పార్టీ ఇటువంటివి చేసింది. అప్పుడు సక్సెస్ అయ్యాయి కానీ.. ఇప్పుడు ఎంత మాత్రం వర్కౌట్ కావు అనేది మెజారిటీ విశ్లేషకుల మాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
Oktelugu Epaper
Exit mobile version