AP Prisoners Release: ఏపీ ప్రభుత్వం( AP government) జైల్లో ఉన్న ఖైదీలకు గుడ్ న్యూస్ చెప్పింది. సత్ప్రవర్తన కలిగిన 17 మంది ఖైదీలను విడుదల చేయనుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రకారం ఎంపిక చేసిన ఖైదీలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మంత్రివర్గంలో ఖైదీల విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకుని ఆమోదించిన సంగతి తెలిసిందే. వివిధ నేరాల్లో చిక్కుకొని జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారిలో సత్ప్రవర్తన ఉన్నవారిని విడుదల చేయనున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రకారం జైళ్ళ శాఖ వీరిని ఎంపిక చేసింది. 2025 ఫిబ్రవరి 1 వరకు శిక్ష అనుభవించాల్సిన ఖైదీలను విడుదల చేస్తున్నారు. విడుదలైన ఖైదీలు కొన్ని షరతులు పాటించాల్సి ఉంది. ఖైదీలు విడుదల సమయంలో రూ.50 వేల వ్యక్తిగత బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. విడుదలైన తర్వాత పోలీస్ స్టేషన్లో హాజరు కావాల్సి ఉంటుంది.
Also Read: Gorantla Madhav: రాజమండ్రి సెంట్రల్ జైలుకు గోరంట్ల మాధవ్.. అరెస్టు నుంచి వరుస ట్విస్టులు!
ఇదో ఆనవాయితీగా
అయితే ఖైదీల విషయంలో ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా సత్ప్రవర్తన కలిగిన వారికి మోక్షం కలగనుంది. విడుదలైన తర్వాత వీరు ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రొబేషన్ అధికారి( probation officer) ముందు హాజరు కావాల్సి ఉంటుంది. విడుదలైన ఖైదీలు మళ్ళీ నేరం చేస్తే వారిని తిరిగి అరెస్టు చేస్తారు. వాస్తవానికి మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఇది ఒక మంచి అవకాశం. వారు తమ జీవితాలను మార్చుకోవడానికి ఉపయోగంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీల విడుదలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాను సిద్ధం చేయాలని జైల్లో శాఖ డీజీని ఆదేశించింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, జూన్, అక్టోబర్ ఒకటవ తేదీల్లో ఖైదీల విడుదల ఉంటుంది.
Also Read: YS Jagan: బట్టలు ఊడదీసి నిలబెడతా.. ఎవరిని వదల.. వల్లభనేని వంశీని పరామర్శించాక చెలరేగిపోయిన జగన్
ప్రత్యేక కమిటీ ఏర్పాటు..
ఖైదీల సత్ప్రవర్తనకు సంబంధించి, ముందస్తు విడుదల కోసం హోం శాఖ ముఖ్య కార్యదర్శి( home department chief secretary) చైర్మన్గా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వీరిలో న్యాయశాఖ కార్యదర్శి, డిజిపి, నిఘా విభాగాధిపతి, జైల్ల శాఖ డిజి, సిఐడి ప్రధాన న్యాయ సలహాదారు ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ ఖైదీల వివరాలను పరిశీలిస్తుంది. అర్హత లేని వారిని తిరస్కరిస్తుంది. సత్ప్రవర్తనతో జైలు నుంచి విడుదలైన వారు.. కచ్చితంగా మంచిగా ప్రవర్తిస్తామని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. విడుదల తరువాత వారు ఏదైనా నేరం చేస్తే తక్షణం క్షమాభిక్ష రద్దు అవుతుంది. అలాగే వ్యక్తిగత పూచికత్తు 50 వేల రూపాయలు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా స్వాతంత్ర దినోత్సవం తో పాటు రిపబ్లిక్ డే నాడు ఖైదీల విడుదల అనేది ఆనవాయితీగా వస్తోంది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఏడాదికి మూడుసార్లు ఖైదీల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏపీకి సంబంధించి త్వరలో 17 మంది ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయ్యింది.