AP Political survey : ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడుతోంది. మరోవైపు సంక్షేమ పథకాల అమలు ప్రారంభం అయింది. జూన్లో కీలకమైన రెండు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోంది. అయితే ప్రజల్లో ప్రభుత్వం కంటే స్థానిక ఎమ్మెల్యేల పైన కాస్త అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలో కూటమి పాలన పై సర్వే నిర్వహించింది ఓ సంస్థ. గతంలో కూటమి గెలుస్తుందని ముందే ఖచ్చితంగా చెప్పిన వారిలో ప్రవీణ్ పుల్లట ఒకరు. రైజ్ సంస్థ పేరుతో నిక్కచ్చి సర్వే అంటూ ఆయన గతంలో చెప్పుకొచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను ఎప్పటికప్పుడు స్పష్టం చేసేవారు. కానీ ప్రవీణ్ పుల్లట సర్వేను అప్పటి వైసిపి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కూటమిపాలన ఏడాది పూర్తయిన నేపథ్యంలో రెండు పార్లమెంట్ స్థానాల్లో కూటమి పరిస్థితి ఎలా ఉంది అనేది తన సర్వే ద్వారా స్పష్టం చేశారు ప్రవీణ్ పుల్లట( Pravin pullata ).
Also Read : ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాలకు భారీ హెచ్చరిక!*
* ఆ రెండు స్థానాలు మినహాయించి..
విజయనగరం జిల్లాలో రైజ్( raise) తాజా సర్వే చేపట్టింది. విజయనగరం పార్లమెంట్ స్థానం పరిధిలో బొబ్బిలి, రాజాం అసెంబ్లీ స్థానాలు తప్పితే.. మిగతా ఐదు అసెంబ్లీ స్థానాల్లో అసంతృప్త స్థాయి అధికంగా ఉందని ప్రవీణ్ పుల్లట స్పష్టం చేశారు. విజయనగరం తో పాటు గజపతినగరం అసెంబ్లీ స్థానాలు యావరేజ్ జాబితాలో ఉన్నాయని వెల్లడించారు. దీనిపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని ప్రకటించారు. ఇక కాకినాడ పార్లమెంట్ స్థానం పరిధిలో తుని, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, రూరల్లో ఎమ్మెల్యేలు, ప్రభుత్వంపై అసంతృప్తి అధికంగా ఉందని ప్రవీణ్ తన విశ్లేషణలో తెలిపారు. పిఠాపురంలో ఎక్కువ ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదని దాదాపుగా చెప్పేశారు. పెద్దాపురంలో మాత్రం కూటమిపై మిశ్రమ స్పందన కనిపిస్తోందన్నారు. తన రైజ్ సర్వే పూర్తి గణాంకాలు ఐవిఆర్ఎస్ ఆడియో రికార్డులు కూడా మీకోసం అందిస్తామని ఎక్స్ లో ప్రవీణ్ ప్రకటించారు.
* ప్రజల్లో అసంతృప్తి అంటూ ఆ మధ్యన కామెంట్స్..
కూటమి( allians ) అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో ప్రవీణ్ పుల్లట సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చంద్రబాబు మునుపటిలా తన ప్రభావం చూపలేకపోతున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం పై చాలా ఆశలు ఉన్నాయని.. ఆ ఆశలు నెరవేర్చే స్థితిలో ప్రభుత్వం లేకపోవడం అసంతృప్తికి కారణమవుతోందని చెప్పుకొచ్చారు. మరోవైపు ప్రవీణ్ పుల్లట సర్వే విశ్లేషణ పై టిడిపి, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్వీట్లు పెడుతున్నారు. ఆయన సర్వే విశ్లేషణపై కౌంటర్లు వేస్తున్నారు. గతంలో ఇదే ప్రవీణ్ పుల్లట ఎన్నికల్లో కూటమి కచ్చితంగా గెలుస్తుందని పలుమార్లు తేల్చి చెప్పారు. సర్వే విశ్లేషణలు విడుదల చేశారు. వీడియోలు కూడా చేశారు. అవన్నీ దాదాపుగా నిజమయ్యాయి కూడా. అయితే తాజాగా ఈ సర్వే విశ్లేషణపై ఆ రెండు పార్టీలు పైకి గంభీరంగా కనిపిస్తున్నాయి. కానీ లోలోపల మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది.
విజయనగరం ఎంపీ సెగ్మెంట్లో బొబ్బిలి, రాజాం అసెంబ్లీ స్థానాలు తప్పితే.. మిగిలిన 5 అసెంబ్లీ స్థానాల్లో అసంతృప్త స్థాయి అధికంగా ఉంది. RISE డీటెయిల్డ్ రిపోర్ట్ అతి త్వరలో.. ఓ చానల్ వేదికగా..
విజయనగరం, గజపతినగరం అసెంబ్లీ స్థానాలు Average జాబితాలో.. pic.twitter.com/tuIp9KOKSM— Praveen Pullata (@praveenpullata) May 15, 2025