AP MLC Election: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక( MLC elections) కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. రెండు పట్టభద్రుల స్థానాలతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి పోలింగ్ జరిగింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవికి సైతం ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మరోవైపు ఉభయగోదావరి తో పాటు కృష్ణ- గుంటూరు స్థానాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ మూడు స్థానాలకు సంబంధించి ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అధికార టిడిపి అభ్యర్థులు బరిలో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో లెక్కింపు ఏర్పాట్లు చేశారు. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానానికి సంబంధించి లెక్కింపు ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతోంది. కృష్ణ గుంటూరు పట్టభద్రుల స్థానానికి సంబంధించి గుంటూరు ఏసీ కాలేజీలో లెక్కింపు చేపడుతున్నారు.
Also Read: జనసేన ప్లీనరీ కుదింపు.. సంచలన నిర్ణయం.. కారణాలు అవే!
* ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిడిపి
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party). అయితే తొలుత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి నిర్ణయించుకుంది. కానీ వివిధ కారణాలు చెబుతూ పోటీకి దూరమైంది. కృష్ణా- గుంటూరు ఎమ్మెల్సీ స్థానానికి 25 మంది పోటీ పడ్డారు. ప్రధానంగా టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మధ్య పోటీ ఉంది. గోదావరి జిల్లాల ఎమ్మెల్సీకి 35 మంది పోటీపడ్డారు. ఇక్కడ టిడిపి అభ్యర్థిగా పేరాభత్తుల రాజశేఖర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ పిడిఎఫ్ అభ్యర్థి గట్టిగానే పోటీ ఇస్తున్నారు.
* బహుముఖ పోటీ
మరోవైపు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ( Uttaran Dhara teachers MLC ) సీటుకు మాత్రం బహుముఖ పోటీ నెలకొంది. ఇక్కడ ఏపీటీఎఫ్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ మరోసారి పోటీకి దిగారు. యుటిఎఫ్ తో పాటు పిడిఎఫ్ అభ్యర్థుల సైతం బరిలో ఉన్నారు. ఈరోజు అర్ధరాత్రి వరకు కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి కూటమి గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
Also Read: వంగవీటి రాధాకు గ్రీన్ సిగ్నల్.. ఆ ఇద్దరికీ నో ఛాన్స్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త సమీకరణలు!