Homeఆంధ్రప్రదేశ్‌AP MLA's Working Report: ప్రభుత్వం పర్వాలేదు.. ఎమ్మెల్యేల తీరే.. 'సర్వే'శ్వరా!

AP MLA’s Working Report: ప్రభుత్వం పర్వాలేదు.. ఎమ్మెల్యేల తీరే.. ‘సర్వే’శ్వరా!

AP MLA’s Working Report: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. అయితే ఈ ఏడాదిలోని అనేక రకాల సర్వేలు వచ్చాయి. ప్రభుత్వ పెద్దల పనితీరుపై మంచి మార్కులే పడ్డాయి. కానీ కొంతమంది ఎమ్మెల్యేల తీరు బాగా లేదంటూ సర్వేలు తేల్చి చెప్పాయి. అయితే అసంతృప్తి, వ్యతిరేకత అనే అంశాల చుట్టూ ఈ సర్వేలు కొనసాగాయి. కానీ ఏడాది పాలనలోనే ఇలా సర్వేలు చేయడం ఏపీలో ప్రత్యేకత. అయితే ఈ సర్వేల వెనుక ఎవరు ఉన్నారన్నది ఒక అనుమానం. అయితే ఈ సర్వేల వెనుక ప్రభుత్వమే ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని సీఎం చంద్రబాబు పక్కగా అడుగులు వేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నాడిని పట్టుకునేందుకు ఈ సర్వేల ద్వారా ప్రభుత్వమే ముందుకు వెళుతోందన్నది ఒక ప్రధానమైన అనుమానం. దాదాపు అన్ని సర్వేలు ప్రభుత్వ పెద్దల పనితీరు బాగుందని చెప్పడం విశేషం.

వైసీపీని బలహీనపరిచేందుకు..
ఈసారి కూటమి కట్టడంతో అద్భుత విజయం దక్కించుకున్న ఈ మూడు పార్టీలు. కనీసం వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే ఏపీ రాజకీయాలు ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ఈసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వకూడదని చంద్రబాబు, పవన్ ద్వయం భావిస్తోంది. అందుకే వరుసగా సర్వేలు చేపట్టి ప్రజల మూడ్ కు అనుగుణంగా పాలన సాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. పైగా ఇది ఎమ్మెల్యేలకు హెచ్చరికల ఉంటుందని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని.. వారి ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. అటు తరువాత చాలామంది ఎమ్మెల్యేల పనితీరుపై అభ్యంతరాలు ఉండడంతో నేరుగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా వారి తీరులో మార్పు రాకపోవడంతో ఈ సర్వేల ద్వారా వారిని అదుపులోకి తెచ్చుకోవాలని ప్రయత్నించినట్లు సమాచారం.

ఎమ్మెల్యేల దూకుడుకు కట్టడి..
చాలామంది ఈసారి కొత్తవారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అటువంటి వారు ఎక్కువగా దూకుడు కనబరుస్తున్నారని ప్రచారం సాగుతోంది. రాజకీయాలకు కొత్త కావడంతో ఒత్తిడికి గురవుతున్నారని.. వారిపైనే అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయని తెలుస్తోంది. అందుకే వారిని సైతం అదుపులో పెట్టేందుకు ఈ కొత్తగా సర్వే పేరుతో కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు వెళ్లడైనా సర్వేలు చూస్తే.. గతంలో అవి తెలుగుదేశం( Telugu Desam Party) పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఇచ్చినవే. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసినవి. అటువంటిది టిడిపి అధికారంలో ఉన్న పార్టీ. ఈ సమయంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా సర్వేలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏడాది పాలనలోనే అన్ని జరిగిపోవు. కానీ ఈ ఏడాది పాలనపై సర్వేలు ఇవ్వడం మాత్రం నిజంగా ఆలోచించదగ్గ విషయం. పైగా ప్రభుత్వ పెద్దల పనితీరు బాగుంది.. ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారు.. కానీ ఎమ్మెల్యేల ప్రవర్తన పై వ్యతిరేకిస్తున్నారు. ఇలా చెబుతున్నాయి ఆ సర్వేలు. సో ఈ సర్వేల వెనుక కచ్చితంగా ప్రభుత్వ పాత్ర ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. 2029 ఎన్నికల వరకు ఇలాంటి సర్వేలు వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు వచ్చిన సర్వేల ఫలితాలను చూసి వైసిపి మురిసిపోవడం లేదు. కచ్చితంగా దీని వెనుక ప్రభుత్వ పాత్ర ఉంటుందన్న అనుమానాలు ఆ పార్టీకి లేకపోలేదు. చూడాలి ఎవరి లెక్కలు వారివి..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version