AP MLA MLC Cultural Program 2026: ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP assembly sessions ) ముగిశాయి. శుక్రవారం తో నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహించిన ఆటవిడుపు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కళా ప్రతిభను చాటారు. విశిష్టమైన ఆహారంతో ఒక్కొక్కరు ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది. తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి పండించారు. భీముడి పాత్రలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, వీర పాండ్యా కట్ట బొమ్మనగా మంత్రి కందుల దుర్గేష్, శ్రీకృష్ణ దేవరాయల వేషధారణలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అలరించారు. ఒకరికి మించి ఒకరు అన్నట్టు పోటీపడి నటించారు. ఆధ్యాంతం కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది.
Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!
* ఆటవిడుపుగా కార్యక్రమం..
శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రజా చర్చల్లో పాల్గొన్నారు. నిత్యం రాజకీయ విమర్శలు, ప్రసంగాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధుల కోసం ఈ ఆటవిడుపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఆహ్లాదకర వాతావరణంలో సమయాన్ని గడిపారు. సీఎం చంద్రబాబు( CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి నారా లోకేష్ అక్కడకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పిల్లలతో సరదాగా ఆటల ఆడుతూ సందడి చేశారు. అలాగే ఇటీవల నిర్వహించిన క్రీడల్లో విజేతలైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బహుమతులు కూడా అందించారు.
* ఆధ్యాంతం కడు రమ్యం..
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి( Galla Madhavi ), సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయ శ్రీ ప్రార్థన గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన సంగీతం, నృత్యం, నాటక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. భీముడిగా రఘురామకృష్ణంరాజు వేదిక పైకి రాగా హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. వీర పాండ్యా కట్ట బొమ్మన పాత్రలో అద్భుతంగా ఇమిడిపోయారు. మరో ఎమ్మెల్యే విజయ్ కుమార్ రుద్రవీణ చిత్రంలోని లలిత ప్రియ కమలం పాటను ఆలపించారు. వీరితోపాటు జీవి ఆంజనేయులు, కామినేని శ్రీనివాస్, జయమంగళం వెంకటరమణ, సునీల్ తదితర ప్రజాప్రతినిధులు వివిధ పాత్రల్లో పాల్గొని కార్యక్రమాన్ని ఉత్సాహంగా మార్చారు. బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ప్రజా ప్రతినిధులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కోసం ప్రత్యేక ఆత్మీయ విందును కూడా ఏర్పాటు చేశారు. ఒక మంచి వాతావరణం లో కార్యక్రమం కొనసాగడం విశేషం.
విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన “ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఎమ్మెల్యే – ఎమ్మెల్సీ సాంస్కృతిక ఉత్సవాలు – 2026” లలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు గారు “భీముని ఏకపాత్రాభినయం” ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి “పాండవ… pic.twitter.com/30MenfsmiJ
— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) March 6, 2026